Back

ⓘ ఖమ్మం                                               

కమ్మమెట్టు (ఖమ్మం ఖిల్లా)

ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. కాకతీయుల పాలనకాలం క్రీ.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది. ఆ తరువాత వచ్చిన ముసునూరి కమ్మరాజులు, కుతుబ్ షాహీ వంశస్తులు కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్తులు దీని పేరు ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ సీతాపతిరాజు ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. అప్పటి నుండి ఈ దుర్గం కుతుబ్‌షాహీల పాలనలో ఉంది. 17వ శతాబ్దంలో తక్కిన ...

                                               

వెంకటాయపాలెం (ఖమ్మం)

వెంకటాయపాలెం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఖమ్మం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఖమ్మం గ్రా నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 6 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

ఖమ్మం జిల్లా

చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసింహాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేణా అది స్థంభ శిఖరి గాను ఆపై స్థంబాధ్రి గా పిలువబడినట్టు తెలుస్తుంది. ఉర్దూ భాషలో కంబ అనగా రాతి స్తంభము కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణంలో కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన. తెలంగాణాలో చారిత్రకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ఖమ్మంలో కల నరసింహాలయం త్రేతా యుగము నాటిదని నమ్మకం. ఖమ్మం జిల్లా పటములో సింగరేణి మండలం యొక్క స్థానము అక్షాంశరేఖాంశాలు: అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి కాలాంశం భాప్రాకా గ్రీ.కా+5:30 సింగరేణి మండల కేంద్రము: కారేపల్లి. గ్రామాలు 11 జనాభా ...

                                               

ఖమ్మం శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఖమం శాసనసభ నియోజకవర్గం నుండి సి.పి.ఎం పార్టీకి చెందిన తమ్మినేని వీరభద్రం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణపై 9820 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తమ్మినేని. వీరభద్రం 46505 ఓట్లు సాధించగా, లక్ష్మీనారాయణ 36685 ఓట్లు పొందినాడు.

                                               

కల్లూరు (ఖమ్మం)

కల్లూరు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా,కల్లూరు మండలానికి చెందిన ఒక చిన్న పట్టణం. ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 50 కి. మీ. దూరంలో ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది.ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.

                                               

గొల్లపాడు (ఖమ్మం గ్రామీణ మండలం)

గొల్లపాడు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఖమ్మం గ్రా నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 9 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 773 ఇళ్లతో, 2712 జనాభాతో 795 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1383, ఆడవారి సంఖ్య 1329. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 435 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 182. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579656.పిన్ కోడ్: 507003.

ఖమ్మం
                                     

ⓘ ఖమ్మం

ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.ఖమ్మం పట్టణం వ్యాపార,ఆర్థిక కేంద్రం.

                                     

1. పద చరిత్ర

చారిత్రిక గ్రంథాల ఆధారంగా ఖమ్మం నగరానికి మునుపటి పేరు ",స్తంభశిఖరి "కంభం మెట్టు" లేదా స్థంభాద్రి. "మెట్టు" అంటే తెలుగు భాషలో కొండ లేదా ఎత్తైన ప్రదేశం. ఈ పేరును "కమోమెట్" మరియు "ఖమ్మమ్మెట్" అని కూడా ఆంగ్లీకరించారు.

                                     

2. చరిత్ర

తెలంగాణలో ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’కు 18.35’ మధ్యగాను ఉండి 15, 921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉంది. జిల్లాకు ఉత్తరమున చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గొండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుభాగం అంతా వేరువేరు రాజ వంశాల కాలాల్లో వేరుగా ఉన్నది 1905 దాకా వంరంగల్ జిల్లలో భాగంగా ఉండేది, ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు, అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది. చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రిగా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దూ భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన. నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ గా పేర్కొనబడినది.

చారిత్రక ఆధారాల ప్రకారము ఖమ్మం నిజనామము స్తంభశిఖరి". తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది.

చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.

                                     

3. భౌగోళికము

ఖమ్మం భౌగౌళికముగా 17.25° ఉ 80.15° తూలో ఉంది.దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణం కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణము అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగ సాగర్ నీరు లభించింది.

                                     

4. స్వాతంత్ర్యోద్యమం

స్వాతంత్య్ర సంగ్రామంలో ఖమ్మం పట్టణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు.

 • 1946 - 1946 ఆగస్టు 5 న మహాత్మా గాంధీ ఖమ్మం మెట్ ఖమ్మం పట్టణం సందర్శన,
 • 1947 ఆగస్టు, 7 - జమలాపురం కేశవరావు, కూరపాటి వెంకట రాజు, జగదీశ్వరయ్య నీలకందన్, బచ్చలకూర లక్ష్మయ్య, వట్టికొండ రామకోటయ్య, హీరాలాల్ మోరియా, తీగల హనుమంతరావు, కిలిపాక కిషన్‌రవు, గెల్ల కేశవరావు, యాదవల్లి వెంకటేశ్వర శర్మ, పుల్లభట్ల వెంకటేశ్వర్లు హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఊటుకూరి కమల స్వాతంత్ర్య సమరయోధురాలు - తెలంగాణ విమోచన
 • 1935 - ఖమ్మం పట్టణంలో మొదటి గ్రంథాలయం స్థాపించబడింది.
 • 1931 - ఖమ్మంలో మొదటి స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది.
 • 1945 - ఖమ్మంలో 12 వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం పెండ్యాల సత్య నారాయణరావు ప్రధాన కార్యదర్శిగా, అహ్వాన సంఘం నిర్వహించారు. ఆ సమావేశంలో బద్దాం ఎల్లారెడ్డిని అధ్యక్షుడిగా, 13 వ రాష్ట్రం ఆంధ్ర మహాసభకు ఉపాధ్యక్షుడిగా పెండ్యాల సత్య నారాయణరావు ఎన్నికయ్యారు. ఈ సమావేశం మార్చి 26–28 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో పుచ్చలపల్లి సుందరయ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి దాదాపు 40.000 మంది హాజరయ్యారు.


                                     

5. పర్యాటక కేంద్రాలు

 • నరసింహస్వామి ఆలయం
 • దానవాయిగూడెం పార్కు
 • లకారం చెరువు
 • తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం
 • కిన్నెరసాని వన్యప్రాణి ఆశ్రయం
 • శ్రీ జలాంజనేయస్వామి ఆలయం
 • లకారం పార్క్ / ట్యాంక్ బండ్
 • ఖమ్మం ఖిల్లా
 • నేలకొండపల్లి
కల్లూరు మండలం (ఖమ్మం జిల్లా)
                                               

కల్లూరు మండలం (ఖమ్మం జిల్లా)

కల్లూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 50 కి. మీ. దూరంలో ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది.ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.ఇది రెవెన్యూ డివిజను ప్రధాన కేంధ్రం,

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →