Back

ⓘ తెలుగు భాషా పత్రిక                                               

తెలుగు భాషా పరిరక్షణ

ఇంగ్లీషు వ్యామోహం వలన ఇంగ్లీషు ప్రాథమిక స్థాయి నుండే బోధనా మాధ్యమంగా ప్రత్యేకించి ప్రైవేటు పాఠశాలలలో బలపడింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు, సినిమాలలో వాడే తెలుగులో ఇంగ్లీషు పదాలు పెరుగుతున్నాయి. భాషోద్యమంతో ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకి ప్రాధాన్యత రాలేదు. ఈ స్థితిని చక్కదిద్దడానికి వ్యక్తులు, సంస్థలు కృషిచేస్తున్నాయి.

                                               

తెలుగు వెలుగు

తెలుగు వెలుగు రామోజీరావు స్థాపించిన రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం వెలువడుతున్న మాసపత్రిక. ఈ పత్రిక రామోజీ విజ్ఞాన కేంద్రం సహకారంతో సాగుతోంది. తెలుగు భాష కీర్తిని గుర్తుచేస్తూ, భాషకు తగిన ప్రాధాన్యం చేకూర్చటానికి ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో బాలభారతం పత్రికతో పాటు ఈ పత్రిక వెలువడింది. రామోజీ ఫొండేషను అధినేత రామోజీరావు తెలుగు వెలుగును గురించి కదలబారుతున్న భాషా పునాదులను గట్టి పరచి, మకరందాల ఊటను రేపటితరాలు కోల్పోకుండా చూసేందుకు- తెలుగువారి ఇంటింటి ఆత్మబంధువు ఈనాడు నిష్టగా చేపట్టిన నిబద్ద కృషి తెలుగు వెలుగు అని అన్నాడు.

                                               

ఈనాడు

ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2018 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 18.07.998 పత్రిక అమ్మకాలతో దేశంలో ఏడవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

                                               

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం

ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధికార భాషా చట్టం 1966 ప్రకారం ఏర్పాటయిన సంస్థ. ఈ చట్టం 14.05.1966 లో అమలులోకి వచ్చింది. 1974 లో ఈ సంఘం ఏర్పాటైంది. ఇది పరిపాలనారంగంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసింది. పరిభాష రూపకల్పన, ప్రభుత్వ శాఖలలో అమలుకు కృషిచేసింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్వతంత్రప్రతిపత్తికోల్పోయి, 2010 లో సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది.

                                               

అమ్మనుడి (పత్రిక)

అమ్మనుడి తెనాలి నుండి ప్రచురితమైతున్న మాసపత్రిక. తెలుగు జాతి ప్రతిక ఉపపేరుతో నుడి-నాడు-నెనరు ఉపశీర్షికతో ఈ పత్రిక వెలువడుతుంది. 2013 అక్టోబరు ప్రచురితమైన నుడుస్తున్న చరిత్ర పత్రిక ఆర్థిక కారణాలవలన ఆగిపోయి, తిరిగి 2015 మార్చి నుండి సరికొత్త పేరుతో ప్రారంభమైంది. అంతర్జాలంలో తెలుగు భాషపై చర్చలు జరుగుతుండడానికి అమ్మనుడి పత్రికలో వచ్చిన వ్యాసాలే కారణం.

                                               

భారతి (మాస పత్రిక)

భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. మార్చి 1991 చివరి సంచిక.

తెలుగు భాషా పత్రిక
                                     

ⓘ తెలుగు భాషా పత్రిక

ఇది లిఖితపత్రికగా మొదలై అచ్చుపత్రికగా రూపాంతరం చెందింది. ప్రతి యేట ఉగాదికి ఒక సంచిక, దీపావళికి మరొక సంచిక వెలువడేది. ప్రవాసాంధ్రుల కోసం అమెరికాలోని అట్లాంటా నుండి ఈ పత్రికను పెమ్మరాజు వేణుగోపాలరావు నడిపేవాడు. వార్షిక చందా 1.50 డాలర్లు. మొదటి సంచిక ఏప్రిల్ 1970లో వెలువడింది. సంపాదకవర్గంలో పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన సత్యనారాయణ, పరిమి కృష్ణయ్య, రావిపూడి సుబ్బారావు మొదలైనవారు ఉన్నారు. మన మాతృభాషను మనము నిత్యము వాడుటకు ప్రయత్నించి మనకు తెలిసిన విజ్ఞానము మనకు తెలిసిన భాషలో వ్రాయగల స్తోమతను సాధించుటయే ఈ పత్రిక ఆదర్శము అని తొలి సంచికలో ఈ పత్రిక ధ్యేయాన్ని తెలిపారు. ఈ పత్రికలో శాస్త్రీయ వ్యాసాలు, కథలు, సీరియళ్లు, కవితలు ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికకి ఇండియాలో కూడ ఆదరణ లభిస్తుందనే ఆశతో, అచ్చురూపంలో వెలువరిస్తే ఇంకా అందంగా తీర్చి దిద్దవచ్చనే ఉద్దేశంతో ఈ పత్రికని ఎమెస్కో సంస్థ అధిపతి ఎమ్‌.ఎమ్‌.రావు సహాయంతో అచ్చురూపంలో మొదలు పెట్టేరు. తరువాత క్రమేపీ పత్రికలో ఆకర్షణ ప్రత్యేకత తగ్గిపోయి పతనమై మూతపడి పోయింది.

1973 అక్టోబరు సంచికలో ఈ క్రింది శీర్షికలు ఉన్నాయి.

 • డి.డి.టి. వరమా? శాపమా?
 • కార్బన్ కాలనిర్ణయ పద్ధతి
 • గణితానందం
 • తెలుగు లిపి
 • ఖండచ్యుతి
 • ఆవుల తిండి
 • మతం - సాంకేతికం
 • మనవి మాటలు
 • బ్రహ్మాండం బద్దలయింది కథ
 • అద్భుతలోహము - అల్యూమినియము
 • సాంకేతిక పదాలపట్టిక
 • మేలుజాతి పశువుల గ్రాసం
 • జీవపదార్థములోని మూలకాలు
 • రచయితల పరిచయం
 • జవాబులేని ప్రశ్న కథ
 • లోహములలోని గ్లాని
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →