Back

ⓘ బ్రహ్మవైవర్త పురాణము                                               

జమదగ్ని

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతి ని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చెసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూత ...

                                               

సర్పవరం

సర్పవరం, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ మండలానికి చెందిన గ్రామం. సర్పవరం గ్రామం. తూర్పు గోదావరి జిల్లా రాజధాని కాకినాడకు 5 కి.మీ దూరములో ఉంది.

                                               

నారద పురాణము

వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. ఈ పురాణంలో 25.000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో విశేషం ఏమంటే సాధారణంగా అధ్యాయాలలో పాదాలు ఉంటాయి, కాని ఈ పురాణంలో పాదాలలో అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలు ఉన్నాయి. పుర్వార్థం సంభాషణ సనక మహర్షికి నారదుడుకి మధ్య జరుగుతుంది. రెండవ భాగం అయిన ఉత్తరార్థంలో వశిష్ఠ మహర్షి వక్త, మాంధాత శ్రోత. ఈ పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అన ...

                                               

వినాయకుడు

వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. గణేశు ...

                                               

శైవము

హైందవ మత సంప్రదాయములో పరమశివుని ప్రధాన అధిదేవతగా ఆరాధించే శాఖను శైవము అంటారు. వీరు శివాలయాలలోని లింగాకారంలో నున్న శివుని పూజిస్తారు. శివారాధకులకు శైవులు అని అంటారు. శైవ మతాన్ని ప్రచారం చేయటానికి సాహిత్యాన్ని సృష్టించిన వారు శివకవులు. వారిలో నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు ముఖ్యులు. వీరిని "శివ కవిత్రయము" అని అంటారు.

                                               

మార్కండేయ పురాణము

మార్కండేయ పురాణములో శైవులు, వైష్ణవులు, మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈ గ్రంథము శివునికి, విష్ణువుకూ, వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది. ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉంది. 50-97 అధ్యాయాలలో పద్నాలుగు మన్యంతరాల గురించిన వివరాలు ఉన్నాయి. అందులోని పదమూడు అధ్యాయాలను 78-90 కలసికట్టుగా దేవీ మహాత్మ్యము ఆది దేవత యొక్క స్తుతి అంటారు. 108 నుండి 133 వరకు అధ్యాయాలలో పౌరణిక వంశాల గురించిన వివరాలు ఉన్నాయి.

                                     

ⓘ బ్రహ్మవైవర్త పురాణము

బ్రహ్మవైవర్త పురాణము లో 18 వేల శ్లోకాలు ఉన్నాయి అని మత్స్య పురాణములోను, నారద పురాణము లోను చెప్పబడింది. కాని ఇప్పుడు 12 వేల పై చిలుకు శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యముగా పరబ్రహ్మ వ్యాప్తము గురించి చెప్పుచున్నది గనుక దీనిని బ్రహ్మవైవర్త పురాణము అన్నారు. ఈ పురాణము నాలుగు భాగాలుగా విభజింపబడింది.

 • శ్రీకృష్ణ ఖండము - పరబ్రహ్మమే కృష్ణునిగా అవతరించి చేసిన చర్యలు
 • ప్రకృతి ఖండము - ఆదిశక్తి గురించి, ఆమె అంశన ప్రభవించిన దేవతల గురించి
 • బ్రహ్మ ఖండము - బ్రహ్మాండోత్పత్తి గిరించి, సృష్టి గురించి
 • గణేశ ఖండము - గణపతి జననవృత్తాంతము, జమదగ్ని పరశురాముల వృత్తాంతము

ఈ పురాణములో శ్రీకృష్ణుడే పరాత్పరుడుగా వ్యాసమహర్షి వర్ణించాడు.

                                     

1. బ్రహ్మ ఖండము

ఈ ఖండములో సృష్టి క్రమము వివరించబడింది. ప్రళయము సంభవించినపుడు ముల్లోకాలలోను బ్రహ్మతేజస్సు మాత్రం ఉంటుంది. ముల్లోకాళకు పైన గోలోకం ఉంటుంది. గోలోకం దిగువ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడైయుండి సృష్టికార్యం చేస్తాడు. వైకుంఠమునకు వామపార్శ్వమున కైలాసం ఉంటుంది. అందులో పార్వతీపరమేశ్వరులుంటారు

శుద్ధజ్యోతిర్మూర్తియైన పరమాత్ముడు గోలోకంనుండి సృష్టికావించవలెనని సంకల్పించెను. త్రిమూర్తులను, 65 తత్వములను పుట్టించెను. పిదప సృష్టియంతయును జరిగెను.

బ్రహ్మ ఆయుష్కాలమును కల్పము అంటారు. కల్పములు మూడు. 1. బ్రహ్మకల్పము 2. శ్వేతవరాహ కల్పము 3. పద్మ కల్పము. కల్పాంతమున అన్నీ నశించగా ఆదివిరాఠ్టు అయిన పరబ్రహ్మము ఒకడే మిగిలియుండును. మరల కల్పారంభమగును.

ఇంకా ఈ ఖండంలో ఉన్న విశేషాలు

 • బ్రహ్మ నారదుని శపించుట - బ్రహ్మ శాపమున నారదుడు ఉపబర్హణుడను గంధర్వుడై జన్మించుట.ఉపబర్హణుని మరణాణంతరము అతని భార్యలు విలపించుట.
 • ఉపబర్హణుని భాఱ్య మాలావతికి శ్రీహరి ఆయుర్వేదమును చెప్పుట - ఆరోగ్య సాధనములు - వాతక్రోప కారణములు
 • నారదుడు శూద్రుని ఇంట పుట్టుట - శ్రీకృష్ణమంత్రమును ధ్యానించుట - తిరిగి బ్రహ్మకు జనించుట
 • ప్రకృత్యోత్పత్తి - శ్రీహరి, ఈశ్వర సంవాదము - శ్రీహరి ఇట్లనెను - "పరమేశ్వరా! ఎట్లు చూచినను నీకును, నాకును భేదమావంతయును లేదు. కావున నిన్నవమానించినవారు నన్నవమానించినట్లే యగును"
                                     

2. ప్రకృతి ఖండము

ఈ ఖండములో తులసి, రమ, సరస్వతి, దుర్గ, రాధ మెదలైన స్త్రీ దేవతల వృత్తాంతాలు, పూజావిధి, వారికి సంబంధించిన ధ్యానము, కవచము మెదలైన విషయాలు చెప్పబడ్డాయి.

బ్రహ్మ, ఈశ్వరుడు, నారాయణుడు చేసిన ఉపదేశముల వలన నారదుడు ఈ సృష్టికంతకును ప్రకృతియే కారణమని తెలిసికొనెను. పరబ్రహ్మము సృష్టిచేయనెంచి తనను తాను రెండుగా విభజించుకొనెను. కుడిభాగము పురుషుడు. ఎడమభాగము స్త్రీయయిన ప్రకృతికాంత. ఆ ప్రకృతి శివునితో కలిసియున్నపుడు దుర్గ, విష్ణువుతో కూడియున్నపుడు లక్ష్మి, బ్రహ్మతో కూడియున్నపుడు సావిత్రి. ప్రకృతి అంశముననే మంగళ, చండి, కాళి, భూదేవి ఉద్భవించారు.

ఇంకా ఇతర విషయాలు

 • తులసీ జన్మము - తులసీ శంఖచూడుల వివాహము - శంఖచూడుని మరణము - తులసీమహాత్మ్యము
 • సాలగ్రామ మహిమ
 • భూదేవికి పుత్రుడై కుజుడు జన్మించుట
 • యాజ్ఞవల్క్య మహామునికి సరస్వతి వరమిచ్చుట
 • దుర్వాసుడు ఇంద్రుని శపించుట
 • మనసోపాఖ్యానము - కశ్యపుని మనస్సునుండి ప్రభవించి బాలిక మనసాదేవి. ఆమెకు జరత్కారి అనే పేరు కూడా ఉంది. - ఆస్తీకుని జన్మవృత్తాంతము
 • తారను చంద్రుడు అపహరించుట
                                     

3. గణేశ ఖండము

ఈ ఖండములో గణేశ జన్మ వృత్తాంతము చెప్పబడింది. అంతే కాకుండా పరశురామునికి కార్తవీర్యార్జునునికి మధ్య జరిగిన యుద్ధము వివరింపబడింది. ఈ ఖండములో గణేశ కవచము, దుర్గా కవచము, పుణ్యకవ్రతము మెదలైన విషయాలు చెప్పబడివవి. గణేశునికి గజ ముఖము రావడానికి కారణము, గణపతి ఏకదంతము పొందడానికి కారణము చెప్పబడింది.

                                     

4. శ్రీకృష్ణ ఖండము

ఈ ఖండములో శ్రీకృష్ణ జన్మవృత్తాంతము చెప్పబడింది.

బ్రహ్మవైవర్త పురాణములోని సంగ్రహవిషయాలు

 • శ్రీకృష్ణుడి నుండి సావిత్రీదేవి, రతీ మనమధులు, అగ్నిదేవుడు, జలము, వరణదేవుడు, విరట్రూపుడు, మహావిష్ణువు నుండి మధుకైటభుల జననం, భూమి యొక్క ఆవిర్భావం గురించి వర్ణించబడింది.
 • ముందుగా గోలోకవర్ణన జరిగింది.
 • శ్రీకృష్ణుడి నుండి శ్రీమన్నారాయణుడు, మహాదేవుడు, బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, సరస్వతి, లక్ష్మి, మహాశక్తుల ఆవిర్భావము గురించి వర్ణించబడింది.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →