Back

ⓘ వ్యవసాయం                                               

చిన్న తరహా వ్యవసాయం

నియోలిథిక్ విప్లవం నుండి చిన్న తరహా వ్యవసాయం ఆచరించబడింది. ఇటీవల ఇది పరిశ్రమ వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదా మరింత విస్తృతంగా, అవధారణార్ధకమైన వ్యవసాయం లేదా ప్రధానంగా మొదటి ప్రపంచ దేశాలలో ప్రబలంగా ఉన్న స్థిరమైన వ్యవసాయ పద్ధతులు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ పెర్స్పెక్టివ్స్ "సుస్థిర వ్యవసాయం కేవలం సూచించిన పద్ధతుల ప్యాకేజీ కాదు. మరింత ముఖ్యమైనది, ఇది మనస్సు యొక్క మార్పు, దీని ద్వారా వ్యవసాయం పరిమిత సహజ వనరుల స్థావరంపై ఆధారపడటాన్ని గుర్తించింది - శిలాజ ఇంధన శక్తి యొక్క పరిమిత నాణ్యతతో సహా, ఇది ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయ విధానాలలో ఒక కీలకమైన అంశం చిన్న తరహా వ్యవసాయం వంటి అనేక స్థిరమైన వ్యవసాయ పద్ధతు ...

                                               

రైతు

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకునే ఉద్యోగులను రైతుకూలీలు అంటారు

                                               

వ్యవసాయ పంచాంగం

పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. ఆంధ్రప్రదేశ్‍తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగాన్ని అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు. పంచాంగాన్ని అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశాలున్నాయి.

                                               

ఎరువు

పెరుగుతున్న జనాభా అవసరాలకు తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయం లో ఎరువులు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించుటకు, భూసారము పెంచుటకు ఉపయోగబడతాయి. ఎరువులు వాడటం ముఖ్యం.

                                               

పల్లెల్లో వ్యవసాయ విధానాలు

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం, సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ఈ ...

                                               

తిమ్మరాజుపాలెం (పర్చూరు మండలం)

తిమ్మరాజుపాలెం, ప్రకాశం జిల్లా, పర్చూరు మండలానికి చెందిన గ్రామం. గ్రామ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. వరి, పొగాకు, ప్రత్తి, మిర్చి, శనగ, మినుము పండించే ముఖ్యమైన పంటలు.

                                               

పంట

పంట: ఏదైనా మొక్కలనుండి గాని చెట్లనుండి గాని, ఒక పంట కాలము లేదా ఒక సంవత్సర కాలంలో పొందే ఫలమును పంట అని వ్యవహరిస్తాము. ఈ పంటల ద్వారా మానవులకు కావలసిన, తిండి గింజలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యములు, పండ్లు, పాడి పశువులకు కావలసిన మేత, గడ్డి మొదలగునవి లభ్యమవుతాయి. ఈ పంటలు పండించే వృత్తిని వ్యవసాయం అనికూడా అంటారు. పంటలు పండించడం లేదా వ్యవసాయం చేయడం రెండూ ఒకటే. ఈ పంటల ద్వారా, పండించేవారు తమకు కావలసిన పదార్థాలు ఉంచుకుని, మిగతావి, మార్కెట్టులో విక్రయిస్తారు. పంటలు సామాజికంగా, సాధారణ పంటలు, వాణిజ్య పంటలు. ఋతువులు, కాలముల రీత్యా పంటలు రెండు రకాలు, ఒకటి ఖరీఫ్ పంట, రెండు రబీ పంట.

                                               

గళ్ళావాళ్ళవూరు

గళ్ళావాళ్ళవూరు, చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలానికి చెందిన. ఈ గ్రామం దిగువ తడకర పంచాయితీలో ఉంది. వ్యవసాయం ఇక్కడి ముఖ్య వృత్తి.

                                               

ధూలే జిల్లా

మారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో ధూలేజిల్లా ఒకటి. ధూలే పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.1998 జూలై 1న ధూలే జిల్లా రెండు ప్రత్యేక జిల్లాలుగా విభజించబడ్డాయి. పురాతన కాలం గిరిజన ప్రజలు నివసించిన ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.జిల్లా ప్రజలలో వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా ఉంది. జిల్లాలో అత్యధికభాగంలో నీటిపారుదల వసతులు లేవు కనుక వ్యవసాయం అధికంగా వర్షాధారితంగా ఉంది. గోధుమ, బజ్రా, జొన్న, ఎర్రగడ్డలు వంటి పంటలతో పత్తి వంటి వాణిజ్యపంటలు కూడా పండించబడుతున్నాయి. గ్రామీణ ప్రజలలో అధికులలో అహిరాని భాష వాడుకలో ఉంది. అహిరాని భాష మరాఠీ భాషాకుటుంబానికి చెందిన భాషలలో ఒకటి. నగరప్రాంతాలలో మరాఠీ భాష వాడుకలో ఉంది. ధూలే మహారాష్ట్ ...

వ్యవసాయం
                                     

ⓘ వ్యవసాయం

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు.

వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం,సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక కేవలం 5% మాత్రమే.

                                     

1. చరిత్ర

ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు.ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీపూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి. క్రీ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు.

                                     

2. హరిత విప్లవం

భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్ధతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్యోద్దేశం.

                                     

3. భారతదేశంలో వ్యవసాయం

భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి

 • జైద్ పంటకాలం: మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు - పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి.
 • ఖరీఫ్ పంట కాలం: జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ.
 • రబీ పంటకాలం: అక్టోబరు నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు - గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి.
                                     

4. వ్యవసాయ పనులు

 • చదునుచేయడం
 • కలుపు మొక్కల్ని తొలగించడం: పొలాల్లో సాగు మొక్కలతోపాటు నేల, నీరు, పోషక పదార్థాలు వెలుతురుకూ పోటీ పడుతూ పెరిగే మనకు అవసరం లేని మొక్కల్ని కలుపు మొక్కలు అంటారు.
 • ఎరువులు:ఎరువులు మొక్కల పెరుగుదలకు వివిధ రకాల పోషకపదార్థాలు కావాలి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, మేంగనీస్, జింక్, మాలిబ్డినం, బోరేట్, క్లోరిన మొదలైనవి.
 • నారు నాటడం లేదా ఊడ్చడం
 • దుక్కి దున్నడం: పంటపండించే ముందు, సరైన కాలంలో దుక్కి దున్నడం, మొట్టమొదటి సారిగా చేసే వ్వసాయపు సాగు పని. దీనివల్ల అనేక లాభాలున్నాయి. నేలను దున్నడం వల్ల నేల గుల్లబారి, మెత్తగా ఉంటుంది. అటువంటి నేలలోకి నీరు పారిస్తే భూమిలోకి ఇంకి, అన్ని వైపులకూ ప్రవహిస్తుంది. నేల మెత్తగా ఉంటే దాని ఉపరితల వైశాల్యం పెరిగి ఆ నేలలో ఎక్కువ నీటి నిలుపుదలకు సహాయపడుతుంది. ఈ నీటిని మెక్కలు పీల్చుకుంటాయి. దుక్కి దున్నడానికి నాగలిని విరివిగా ఉపయోగిస్తారు.
 • దారులు చేయడం
 • నీరు పెట్టడం
 • ఎరువులు వేయడం
 • భూమిని చదునుచేయడం: పొలంలోని మట్టిగడ్డల వలన నేల ఎగుడుదిగుడుగా ఉంటుంది. దానివల్ల ఆనేలలో విత్తనాలు జల్లడానికి, నారు మొక్కలు వేయడానికి అనువుగా ఉండదు. నేలను చదును చేయడం వల్ల నీరు, పోషక పదార్థాలు సమానంగా సర్దుబాటు అవుతాయి. పొదుపుగా లాభసాటిగా నీరు ఉపయోగించడానికి నేల చదునుగా ఉండాలి.
 • విత్తడం:విత్తనాలు విత్తే ముందు రైతులు ఏ వ్యాధిలేని విత్తనాలు ఎంపిక చేస్తారు. దీనివల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది.
 • పంట ఉత్పత్తి
 • నీటి పారుదల: మొక్కల పెరుగుదలకు, పంటల ఉత్పత్తులకూ నీరు చాలా అవసరం.
 • దమ్ము చేయడం

రసాయనిక ఎరువులు కర్మాగారాలలో తయారైన రసాయనాలు సహజ ఎరువులు మొక్కలను విచ్ఛిన్న పరచి సహజ ఎరువులను తయారు చేస్తారు.

 • కోసిన పంటని ఎండబెట్టడం
 • కట్టలు కట్టడం
 • తూకం, బస్తాలు నింపడం
 • పంట కోయడం
 • పురుగు మందులు చల్లడం
 • కుప్ప వేయడం
 • నూర్చడం లేదా ధాన్యాన్ని వేరుచేయడం


                                     

5. వ్యవసాయ పనిముట్లు

 • గొడ్డలి Axe
 • ట్రాక్టర్ Tractor
 • ఎద్దుల బండి Bullock cart
 • పాఱ Spade
 • నాగలి Plough
 • కొడవలి Sickle
 • పలుగు Iron crowbar
 • ఏతము Picotta

వ్యవసాయ పనిముట్లు చాలా ఉన్నాయి.

గుంటక గొర్రు

నీటిని పైకి తోడి పంటలకు పారించే విధానం లో: కపిలి, గూడ, ఏతం, ఇవి గతంలో విరివిగా వాడకంలో వుండేవి, ఇప్పుడు తక్కువ వాడుచున్నారు: చేతి పనిముట్లు:

తొలిక, కొడవలి, కత్తి, గుద్దలి, కొంకి, పిక్కాసు,

చెరుకు నుండి రసం తీయడానికి వాడే యంత్రం,

గానుగ గింజల నుండి నూనె తీయడానికి వాడే యంత్రం,

గానుగ గింజల నుండి పప్పులను పిండి చేయడానికి వాడే యంత్రం,

రుబ్బు రోలు, విసుర్రాయి

                                     

6. విద్య

పాలిటెక్నిక్

ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము వ్యవసాయంలో రెండేళ్ళ డిప్లొమా కోర్సులు అందజేస్తున్నాయి. 10 వ తరగతి 55శాతం హింది మినహాయించి తో, 1-10 తరగతులలో నాలుగు సంవత్సరాలు గ్రామాలలో చదివి, 15-22 సంవత్సరాల వయస్సుగల అభ్యర్థులు వీటికి అర్హులు. బోధన తెలుగులో వుంటుంది.

డిగ్రీ

ఎమ్సెట్ పరీక్ష ద్వారా రకరకాల సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కోర్సులు:

 • బిఎస్సి వ్యవసాయం, బిఎస్సి ఉద్యానవనం, బివిఎస్సి మరియుపశుగణాభివృద్ధి, బిఎస్సి వాణిజ్య వ్యవసాయం, వ్యాపార నిర్వహణ,బిఎఫ్సి,
 • బిటెక్ జీవసాంకేతిక శాస్త్రం, బిటెక్ ఆహార విజ్ఞానం, సాంకేతికం, బిటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్,బిటెక్ పశుపోషణ
                                     

7. ఉపాధి

స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో వివిధ ఉపాధి అవకాశాలున్నాయి. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకి సంబంధించిన వివిధ ప్రాంతీయ కేంద్రాలలో, కృషి విజ్ఞాన కేంద్రాలు, నేషనల్ డెయిరీ రీసెర్చ్, ఫారెస్ట్ రీసెర్చ్, వెటర్నరీ రీసెర్చ్, కమోడిటి బోర్డులు, సహకార సంస్థలలో వివిధ స్థాయిలలో ఉద్యోగాలుంటాయి. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, వ్యవసాయ క్షేత్ర మేనేజర్, విషయ నిపుణులు అసోసియేట్ లేదా ఫెలో స్ధాయి, శాఖాధిపతి,ప్రిన్సిపల్ సైంటిష్టు, అసిస్టెంట్ కమీషనర్ ల పేర్లతో ఉపాధి అవకాశాలుంటాయి.

ప్రైవేటు రంగంలో విత్తనాల ఉత్పత్తి, పురుగు మందులు, ఎరువులు శాఖలలో, బ్యాంకులలో వ్యవసాయ ఋణాలు మంజూరుకు, బీమా సంస్థలలో, వివిధ మాధ్యమాలలో వ్యవసాయ కార్యక్రమాల రూపకల్పనకి విషయ నిపుణులుగా, వ్యవసాయానికి సంబంధించి రకరకాల ఉపాధి అవకాశాలున్నాయి.

                                     

8. ఇవీ చూడండి

 • వ్యవసాయంలో భారత మహిళలు
 • భారత ప్రగతి ద్వారం
 • వ్యవసాయం ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము తెలుగు మాస పత్రిక
 • పల్లెవాసుల జీవనవిధానం
 • అన్నదాత పత్రిక
 • పాడిపంటలు పత్రిక
 • వ్యవసాయ శాస్త్రం
 • హరిత విప్లవం
 • వ్యవసాయం
మొరాకో
                                               

మొరాకో

మొరాకో: ఆఫ్రికన్, ఇస్లామిక్, అరబ్, బెర్బర్, యూరోపియన్ ప్రభావాలు గల ఈ చిన్న దేశానికి ఏటా 4 లక్షలకు పైగా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్య వనరులు వ్యవసాయం,ఫాస్ఫేట్ గనులు. ఫెస్ లో ఉన్న విశ్వవిద్యాలయం, ప్రపంచంలోనే అతి పురాతనమైనది. మొరాకో ప్రజలు పుదీనా టీని సేవిస్తారు.చేతితో అల్లిన మొరాకో తివాచీలు చాలా ప్రసిద్ధమైనవి.

                                               

నక్కన పల్లి

నక్కన పల్లి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నకు చెందిన గ్రామం. ఈ గ్రామం శాంతిపురానికి 5కిమీ దూరంలో పడమటి వైపున ఉంది. ఇక్కడ 5వ తరగతి వరకు బడి ఉంది. ఇక్కడ ప్రజల జీవనోపాది వ్యవసాయం, పట్టుపురుగుల పెంపకం.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →