Back

ⓘ తణుకు



                                               

తణుకు శాసనసభ నియోజకవర్గం

తణుకు ఇరగవరం అత్తిలి నియోజకవర్గం ఏర్పడిననాటి నుంచి 2009 వరకూ తణుకు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలు, పెంటపాడు మండలంలో మరికొన్ని గ్రామాలతో కలిపి తణుకు నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్తిలి శాసనసభ నియోజకవర్గాన్ని రద్దుచేసి అత్తిలి మండలాన్ని తణుకు నియోజకవర్గంలో కలిపారు. అప్పటివరకూ ఈ నియోజకవర్గంలోనే ఉన్న ఉండ్రాజవరం మండలాన్ని నిడదవోలు నియోజకవర్గంలోకి చేర్చారు. పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న ఇరగవరం మండలాన్ని తణుకు నియోజకవర్గంలో కలపడంతో ప్రస్తుత స్థితిలోని తణుకు శాసనసభ నియోజకవర్గం ఏర్పాటైంది.

                                               

తణుకు పురపాలక సంఘం

తణుకు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం నరసాపురం లోకసభ నియోజకవర్గంలోని, తణుకు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది నరసాపురం రెవెన్యూ డివిజను పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

వేల్పూరు (తణుకు మండలం)

వేల్పూరు, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన గ్రామం. వేల్పూరు గ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పెద్ద గ్రామాలలో ఒకటి. ఈ గ్రామంలో సుమారుగ 25 వేల జనాభా నివసిస్తున్నరు. ఈ గ్రామం రెందు పర్యాయములు జాతీయ ఉత్తమ గ్రామ పంచాయితీగా ఎన్నుకొనబదినది. ఈ గ్రామంలో సుమారు 120 ఆలయములు ఉన్నాయి. వేల్పూరు పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తణుకు నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6781 ఇళ్లతో, 22768 జనాభాతో 832 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 11102, ఆడవారి సంఖ్య 11666. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2905 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ ...

                                               

తణుకు మండలం

తణుకు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం. తణుకు పట్టణం ఈ మండల కేంద్రం. దీనితో పాటు ఈ మండలంలో 8 గ్రామాలున్నాయి. తూర్పున పెరవలి, ఉత్తరాన ఉండ్రాజవరం, వాయవ్యంలో తాడేపల్లిగూడెం, పశ్చిమాన పెంటపాడు, నైరుతిలో అత్తిలి, దక్షిణాన ఇరగవరం మండలాలు ఈ మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి. OSM గతిశీల పటము

                                               

తణుకు బ్లాకు-1 (తణుకు మండలం)

తణుకుబ్లాకు-1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.దీనిని పూర్వం తారకాపురం అంటారు.అదే తరువాత తళుకుగా,ఆ తరువాత తణుకుగా రూపాంతరం చెందింది. తణుకుబ్లాకు-1, అనేది తణుకు పురపాలక సంఘంలో ఒక భాగం.దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.ఇది కొవ్వూరు రెవెన్యూ విభాగంలో పరిధిలో ఉంది. తణుకు మండలానికి ప్రధాన కేంద్రం.పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తరువాత తణుకు ఐదవ అతిపెద్ద పట్టణం. తణుకు, నర్సాపురం లోకసభ నియోజకవర్గంలోని, తణుకు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పట్టణం.

                                               

కొమరవరం (తణుకు)

కొమరవరం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన గ్రామం. ఇది అత్యంత మనోహరమయిన గ్రామం. వట్టిపులుసు సూరన్న అనే వ్యక్తి 30 యేళ్ళ పాటు ఏకగ్రీవంగా ఈ గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. కొమరవరం పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తణుకు నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1029 ఇళ్లతో, 3474 జనాభాతో 255 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1745, ఆడవారి సంఖ్య 1729. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 580 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588548.పిన్ కోడ్: 534222.

తణుకు
                                     

ⓘ తణుకు

తణుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఇదే తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తణుకు 32 వార్డుతో 72.348 జనాభాతో ఉండేది 2013వ సంవత్సరంలో తణుకు మున్సిపాలిటీ లో మూడు గ్రామాలను వెంకటరాయపురం, పైడిపర్రు మరియు వీరభద్రపురం విలీనం చేశారు అప్పుడు తణుకు మున్సిపాలిటీ పరిధి 24.83 కి.మీ గా పెరిగి 34 వార్డు లో 90.430 మంది జనాభా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు ప్రకారం ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం మరియు పాలకొల్లు తర్వాత తణుకు ఐదవ పెద్ద పట్టణంగా ఉంది.

                                     

1. పేరు వెనుక చరిత్ర

స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాతం అసురుల రాక్షసులు యొక్క రాజైన తారకాసురుని రాజ్యపు రాజధానిగా చెప్పబడుచున్నది. పరిసర ప్రాంతాలలో ఈ కథనానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా లభ్యమవుచున్నాయి. అవి కొన్ని ఇక్కడ పొందు పరిచాము. ప్రస్తుత పాలంగి ఆ రోజులలో పూలంగి పూల కొట్టు గానూ, ప్రస్తుత చివటం గ్రామం శ్రీవతం ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం గానూ, అప్పటి ధాన్యాగారమే ఇప్పటి వడ్లూరు గానూ, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం బంగారం భద్రపరుచు ప్రాంతం గానూ, బహుశా ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు.

ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్ధం నుండే చాలా గ్రామాలకు పేరు స్థిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్ర పురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామమం వేల్పూరు వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు గా పిలవబడుచున్నదని చెబుతారు.ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నో గుడులు ఆలయాలు ఉండడం మనము గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉంది.అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు గానూ, అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. ఇవన్నీ ఎలా ఉన్ననూ తణుకు యొక్క ప్రశస్తి పురాణాలలో కూడా ఉన్నట్లు పండితులు చెబుతారు. ఆదికవి నన్నయ ఇక్కడే యాగం చేసినట్లు చరిత్ర చెబుతోంది.

తణుకు పట్టణానికి తారకేశ్వరపురం అన్న పూర్వనామం ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు.

                                     

2. చరిత్ర

గోస్తని నది పుణ్యజలధారలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది. దీనిని బట్టి తణుకు ప్రాంతానికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతున్నది. మధ్యయుగాలలో, ఆధునిక యగంలో తణుకు ప్రశస్తి అనేక చోట్ల కనిపిస్తూ ఉంది. వర్తమానంలో తణుకు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తూ ఉంది. వ్యవసాయకంగాను, పారిశ్రామికంగాను, విద్య, వైద్య రంగాలలోను తణుకు ఎంతో అభివృద్ధి చెందింది. తణుకు మండలానికి చెందిన మండపాక గ్రామం, వేల్పూరు గ్రామం రాజకీయ చైతన్యానికి, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞాన వినియోగానికి జిల్లా మొత్తంలో ముందువరుసలో ఉన్నాయి. భారతదేశంలో మొదటి సారిగా రాకెట్ ఇంధనం తయారి పరిశ్రమ తణుకులోనే ఏర్పాటు చేయడం జరిగింది/

                                     

3. తణుకులో కవులు

  • ఘండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి
  • కొప్పర్తి వెంకటరమణమూర్తి
  • టి.వి.కె సోమయాజులు
  • రామారావు యిర్రింకి
  • కళాప్రపూర్ణ పండిత పెనుమత్స సత్యనారాయణరాజు తెలుగు రాజు
  • ఆది కవి నన్నయ్యభట్టు
  • డా.తంగిరాల సుబ్బారావు
  • రవి నాగ వెంకట శాస్త్రి రంగావఝుల
  • ముదిగంటి జగ్గన్న శాస్త్రి
  • వేదుల సూరి
  • బి.వి.వి.ప్రసాద్ హైకూ కవి,
  • కోట వేంకట లక్ష్మీనరసింహం - సహస్రావధాని
  • పడాల సత్యనారాయణరెడ్డి
  • డా.వేదుల సూర్యనారాయణ శర్మ
  • పామర్తి రమణ
  • రంగినీని సత్యనారాయణ రాజు రసరాజు
  • అక్కిపెద్ది రామ సూర్యనారాయణ - అష్టావధాని
  • తాళ్లభట్టు పాపరాజు
                                     

4. రవాణా వ్యవస్థ

రైలు రవాణా

తణుకులో రైల్వే స్టేషను విజయవాడ జంక్షన్, నిడదవోలు మధ్య ఉంది. ఇది సింగల్ లైన్, విద్యుదీకరణ లేదు. దాదాపు 20 పాసింజర్ & 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు తణుకు ద్వారా వెళ్ళి హైదరాబాదు, చెన్నై, బెంగుళూర్, విశాఖపట్నం, ముంబై స్టేషనులకు కనెక్ట్ అవుతాయి.

రోడ్డు రవాణా

తణుకులో ఉన్న జాతీయ రహదారి-16 చెన్నై నుండి కలకత్తాకు కనెక్ట్ చేసి ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా ప్రధానంగా స్టీల్, బొగ్గు, చమురు, మేజర్ నిర్మాణ సామగ్రి వాహనాలు రోజువారీ వెళ్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యెుక్క ప్రధానమైన ఉత్పత్తి స్టీల్.

                                     

5. విద్యాలయాలు

సంపూర్ణ అక్షరాస్యతకు మార్గదర్శి తణుకు.అక్షరాస్యతా వార్తలలో తణుకు పట్టణం ప్రత్యేక స్థానంలో ఉంది.2000 సెప్టెంబర్ 8న అక్షరయజ్ఞం పేరుతో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమానికి ఈ పట్టణం శ్రీకారం చుట్టింది.2001 మార్చి 15న శాసనసభలో పాఠశాల విద్యాశాఖ మంత్రి సంపూర్ణ అక్షరాస్యతా సాధించిన తొలి పట్టణంగా తణుకును ప్రకటించారు.ఇప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడానికి తీర్మానించిన తొలి తెలుగు పట్టణంగా ముందుకు వచ్చింది.

                                     

6. పాఠశాలలు

  • మున్సిపల్ పాఠశాలలు, మొదలైనవి.
  • అక్షర పాఠశాల
  • మాంటిస్సోరి స్కూలు
  • భారతీ విద్యాలయం
  • శ్రీమతి జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల
  • ఎస్.ఎఫ్.ఎస్. సెయింట్ ఫ్రాన్సిస్ డే సేల్స్ హై స్కూల్
  • శ్రీ తిమ్మరాజు ఉన్నత పాఠశాల
  • శతవసంతాల పాఠశాల జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల
  • రవీంద్రభారతి పాఠశాల
  • శశి విద్యాసంస్థలు
  • గురజాడ విద్యానికేతన్
                                     

7. కళాశాలలు

  • ఆకుల శ్రీ రాములు ఇంజినీరింగ్ కళాశాల
  • శ్రీమతి కొండేపాటి సరోజినిదేవి మహిళా కళాశాల
  • ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
  • శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • శ్రీమతి నడింపల్లి వర్దనమ్మ తిరపతి రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • శ్రీ ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటిక్నిక్ కళాశాల SMVM
  • ఎస్.ఎన్.వి.టి ప్రభుత్వ జూనియర్ కళాశాల
                                     

8. దేవాలయాలు

సిరిసంపదలతో,వ్యవసాయ,పారిశ్రామిక రంగాలలో పరిపుష్టిగా ఉన్న తణుకు పట్టణం, ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకస్దానం పోందింది.

  • కన్యకాపరమేశ్వరి ఆలయం
  • కపర్దీశ్వరస్వామి ఆలయం
  • రామాలయం
  • శ్రీ రామసుబ్రహ్మణ్యశ్వరస్వామి దేవాలయం
  • యల్లారమ్మ దేవాలయం మండపాక
  • సిద్దేశ్వరస్వామి ఆలయం
  • పామర్తి వారి గుడి నటరాజ స్వామి ఆలయం
  • సాయిబాబా గుడి
  • వినాయకుని గుడి
  • శ్రీ కేశవస్వామి వారి దేవస్థానము
  • ముత్యాలమ్మ గుడి
  • జైన దేవాలయం
  • వేంకటేశ్వరస్వామి దేవాలయం
  • సూర్య దేవాలయం
  • శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయం
  • శ్రీ ఈశ్వరమ్మ ఆలయం వేల్పూరు
                                     

9. పండుగలు

తణుకులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

  • ఉగాది: తెలుగు నూతన సంవత్సర ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. సాధారణంగా ఇది మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
  • దసరా: ఆశ్వయుజ శుద్ధ దశమి. అక్టోబర్ నెలలో వస్తుంది.
  • శ్రీరామనవమి: చైత్ర శుద్ధ నవమి. మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
  • వినాయక చవితి: బాధ్రపద శుద్ధ చవితి. ఆగష్టు/సెప్టెంబర్ నెలలలో వస్తుంది.
  • సుబ్రహ్మణ్య షష్టి
  • సంక్రాంతి: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి 14 న వస్తుంది.
  • దీపావళి: ఆశ్వయుజ బహుళ అమావాస్య. నవంబర్ నెలలో వస్తుంది.
  • ముత్యాలమ్మ జాతర
  • కేశవశ్వామి తిరునాళ్ళు: తిరునాళ్ళు, రథోత్సవం, గరడ వాహన సేవ
                                     

10. తణుకులో బ్యాంకులు

  • భీమవరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 1996
  • ది వైశ్యా బ్యాంక్ 1976
  • ది లక్ష్మి విలాస్ బ్యాంక్ 1993
  • యూనిటి ట్రాస్ట్ ఆఫ్ ఇండియా 2005
  • కెనరా బ్యాంక్ 2003
  • బ్యాంక్ ఆఫ్ బరోడా
  • ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంక్
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1959
  • ది వాణి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 1999
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1993
  • యు.టి.ఐ.బ్యాంక్
  • హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు 1979
  • ఇండస్ ఇండ్ బ్యాంకు
  • విజయా బ్యాంక్ 1976
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా 1997
  • ఆంధ్రాబ్యాంక్ 1954
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1957
  • కారొఎరేషన్ బ్యాంక్
  • కోస్టల్ బ్యాంక్ 2001
  • జిల్లా సహకర కేంద్ర బ్యాంక్ 1976
  • ఇండియన్ బ్యాంక్ 1938
                                     

11. రెస్టారెంట్లు

1) జే.కే 2) శంకర్ విలాస్ ప్యూర్ వెజిటేరియన్ 3) స్కందపుర్వజ 4) తాజ్ దర్బార్ 5) గ్రీన్ ల్యాండ్ 6) హొటల్ రవీంద్ర ప్యూర్ వెజిటేరియన్ 7) అవధాని ప్యూర్ వెజిటేరియన్ కర్రీపాయింట్, పాత అర్బన్ పోలీస్ స్టేషను ప్రక్కన 8) అనుపమ రెస్టారెంట్ 9) చిట్టూరి హెరిటెజ్ 10) విజయా మెస్ 11)శంకర కర్రీ పాయింట్

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →