Back

ⓘ సాంఖ్య దర్శనము                                               

హిందూమతంలో నాస్తికత్వం

నిరీశ్వరవాదం అనేక సనాతన, సాంప్రదాయ విరుద్ధ తత్త్వాలలో దైవానికి ఉనికి లేదని ఉటంకించే వాదం. భారతదేశపు తత్త్వాలలో వేదాలను ధిక్కరించే తత్వాలు మూడు. అవి చార్వాకం జైన మతము, బౌద్ధ మతము నాస్తికం అనే పదం సాంప్రదాయ విరుద్ధమైనను, దైవాన్ని నమ్మకపోవటంకంటే కూడా, ఈ పదం వేదాలను నమ్మకపోవటమే సూచిస్తుంది. పై మూడు వాదాలు సృష్టికర్తను కూడా ధిక్కరిస్తాయి. హైందవ మతము కేవలం ఒక మతమే కాదు, తత్త్వము కూడా. హైందవ తత్త్వాలలోని సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, మీమాంసా దర్శనము వంటి ఇతర వ్యవస్థలలో వేదాలను, సృష్టికర్తను ధిక్కరించకుండానే దైవాన్ని, దైవం యొక్క మహిమలను ధిక్కరిస్తాయి. సాంఖ్య, యోగ దర్శనాలు ఆది-మధ్య-అంత రహితుడైన, తనన ...

                                               

త్రిగుణములు

త్రిగుణములు అంటే భగవద్గీతలో వర్ణించిన భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. ఇవి తామస లేదా తమోగుణం, రాజస లేదా రజో గుణం, సత్వ గుణం. ఈ మూడు హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన ప్రధాన గుణములు. భగవద్గీతలో గుణత్రయ విభాగంలో వీటి గురించి వివరణ ఉంది. రజో గుణం వల్ల కోరికలు, ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృష్ణ జనిస్తాయి. భగవద్గీత ప్రకారం సత్త్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల మోహం, తమోగుణం వల్ల అజాగ్రత్త, అవివేకం, మరపు, పరాకు మొదలైనవి కలుగుతాయి. సత్వ గుణం కలిగిన వారు పై లోకాలకు వెళుతున్నారు. రజోగుణం కలిగిన వారు మానవ లోకంలో జన్మిస్తున్నారు. తమోగుణ ప్రవృత్తి గలవారు అథోలోకాలను వెళుతున్నారు.

                                               

న్యాయ దర్శనము

న్యాయ దర్శనము శాస్త్రములకు శాస్త్రమని అర్ధము. దీనికి మరో పేరు తర్కశాస్త్రము. అంత మాత్రము చేత న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని అనరాదు. న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము అను రెండునూ ఒకనాడు ఒకే దర్శనముగా ఉండెడిది. కాలక్రమేణా రెండు దర్శనములుగా విడిపోయినవి. తాత్విక సమస్యలపై వాదోపవాదాలకు అవసరమైన నియమ నిబంధనలే న్యాయ దర్శనముగా గౌతమ మహర్షి సూత్రబద్దం చేసాడు. దీనిలో మొత్తం 524 సూత్రాలు ఉన్నాయి. కొందరు ప్రథమ దర్శనము అంటే వైశేషిక దర్శనము మాత్రమే అని, మరికొందరు న్యాయ దర్శనము అను వాదనలు ఉన్ననూ, చివరికి ఏకాభిప్రాయమునకు వచ్చి, వైశేషిక దర్శనము ప్రమేయముల గురించి విపులముగా చెప్పడము జరిగింది. గౌతముని న్యాయ సూత ...

                                               

త్రిమతాలు

హిందూమతంలో దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు. విశిష్టాద్వైతం లేదా వైష్ణవం అద్వైతం లేదా స్మార్తం ద్వైతం లేదా మధ్వం పై పట్టికలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే పదాలను సిద్ధాంతాలకూ; స్మార్తం, వైష్ణవం, మధ్వం అనే పదాలను ఆచారాలకూ ఎక్కువగా వాడుతారు.

                                               

ధర్మము

ధర్మము అనగా మానవత్వాన్ని రక్షించే గుణము. హిందూ దేశానికి ధర్మక్షేత్రమని పేరు. సకల ప్రాణికోటిలో మానవ జన్మము ఉత్తమమైనది. ఇలాంటి మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో మానవజాతి ఒక్కటే సమర్ధమైనది. ఇతర ప్రాణులలో లేని బుద్ధి విశేషముగా ఉండటమే దీనికి కారణము. ఆహార భయ నిద్రా మైథునములు అన్ని ప్రాణుల యందు సమానమై, కేవలము యుక్తాయుక్త విచక్షణ, ఆలోచనకు రూపమీయగల ప్రజ్ఞ బుద్ధి ద్వారా సాధ్యమై ఈ ఉత్తమ గుణాన్ని సాధించవచ్చును. "ధర్మం", ఈ పదానికి, ఈ భావనకు భారతీయ మతాలలో చాలా అర్ధాలుఉన్నాయి. సనాతన ధర్మం ప్రకారం ఏ ప్రవర్తనా నియమావళి, మూల సూత్రాలు, మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత, సామాజిక, మతపర జీవితం సజావుగా నడపబడుతుందో, ఏ ...

                                               

తంత్ర దర్శనము

అనగా ఆత్మ కి, పరమాత్మ కి మధ్య కేవలం వ్యక్తిగత పరిమితులు ఉపాధి, వివిధ సామర్థ్యాలు మాత్రమే కలవు; అంతకు మించి వేరే ఏ భేదమూ లేదు. "నా లో ప్రాణము కలదు" అని పురుషుడు తెలుసుకొనేలా చేయటమే ప్రకృతి ధర్మము. ఓ మానవా! నీవు గుర్తుంచుకొనవలసినది ఇదే!!! అనగా ఈ పరిమితులు, వివిధ లక్షణాలు ఆత్మలోనూ, పరమాత్మలోనూ కలవు. ఈ భేదాలని కరిగించినచో, ఒక వ్యక్తి తన రాజ్యానికి తానే ఎలా రాజగునో, అలా ఆత్మయే పరమాత్మ అగును. ఈ భేదాలని తొలగించు. అప్పుడు ఆత్మ, పరమాత్మ నీకు వేరుగా కనబడవు!!! తంత్రం సంస్కృతం: तन्त्र అనే పదానికి తెలుగులో అర్థం నేత, లేదా అల్లిక. ఈ నేత/అల్లికలు అనంతమైన స్పృహ చైతన్యానికి సూచికలు. పరస్పర వ్యతిరేకాల అల్లి ...

                                     

ⓘ సాంఖ్య దర్శనము

హిందూ ధర్మశాస్త్రాలలో జీవుడు, ప్రకృతి, తత్వము, మోక్షము వంటి విషయాలను విశ్లేషించే తత్వశోధనా రచనలను దర్శనాలు అంటారు. సాంఖ్యము, యోగము, వైశేషికము, న్యాయము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే ఆరు ఆస్తికదర్శనాలు. వీటిలో మూల ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది సాంఖ్యదర్శనము.

ఇది కపిల మహర్షి చే ప్రవర్తింపజేయబడింది. విశ్వ సృష్టికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈ దర్శన సారాంశము. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుషుల సంయోగము వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధిస్తాయి.

ముందుగా ఇది నాస్తికవాదమనీ, తరువాత ఆస్తిక వాదాలలో ఒకటిగా విలీనం చేయబడిందనీ కొందరి వాదన. "ఈశ్వర కృష్ణుడు" రచించిన "సాంఖ్యకారిక" ఒకటే ఈ విషయంపైన స్పష్టమైన గ్రంథం.

                                     

1. మౌలిక సూత్రాలు

సాంఖ్యవాదం ప్రకారం జ్ఞానానికి మూడు ప్రమాణాలను అంగీకరించవచ్చును

 • అనుమాన ప్రమాణాలు: ఇలా కావచ్చును అని ఊహించింది. ప్రత్యక్ష ప్రమాణాల వల్ల గ్రహించిన విషయాన్ని ఉపయోగించి, తెలియని విషయాన్ని అంచనా వేయడం. ఉదా: పొగ కనిపించింది కనుక నిప్పు ఉన్నదని చెప్పడం
 • ప్రత్యక్ష ప్రమాణాలు: మనకు ఇంద్రియాల ద్వారా తెలిసేది. వీటిలో మళ్ళీ రెండు విధాలున్నాయి నిర్వికల్ప ప్రమాణాలు: ఇంద్రియాల ద్వారా గ్రహించింది, కాని అర్ధం కానిది. ఉదా: ఒక పసిపిల్లవాడు ఒక జంతువును చూస్తాడు కాని వాడికి దాన్ని గురించి ఏమీ తెలియకపోవచ్చును సవికల్ప ప్రమాణాలు: ఇంద్రియాల ద్వారా గ్రహించడమే కాక అర్ధం చేసుకొన్నది. ఆ విషయానికి, మరో విషయానికి ఉన్న భేదం తెలుసుకున్నది. ఇది సరై జ్ఞానానికి ఆధారం.
 • శబ్ద ప్రమాణం: వేరేవారు చెప్పగా విన్న విషయాలు
                                     

2.1. సాంఖ్య తత్వము ప్రధాన విషయాలు

"పురుషుడు", "ప్రకృతి" అనేవి రెండు విభిన్నమైన అంశాలు అనేది సాంఖ్యంలో ఒక మౌలికమైన సూత్రం. సృష్టిలో అన్నీ ఈ రెండింటిలో ఏదో ఒకదానికి చెందుతాయి.

 • పురుషుడు

అంతటా వ్యాపించి ఉన్న స్వతంత్ర, నిరాకార ఆత్మ తత్వం. అంతటా ఉంది. ఇంద్రియాలకు తెలియరానిది. మాటలలో చెప్పజాలనిది. వేదాంతములో "బ్రహ్మము" కూడా ఇలాగే వర్ణించబడింది. పురుషునకు ఏవిధమై మాలిన్యాలు అంటవు. పురుషుడు శాశ్వతము. పురుషుని ఎవరూ సృజించలేదు. పురుషుడు దేనినీ సృజింపడు.

 • ప్రకృతి

సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉంది. ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ యదార్ధంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన, "సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ బంధం నుండి విముక్తి లభిస్తుంది.

 • ఈశ్వరుడు

కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరునికి స్థానం లేదు. కారణం - ఈశ్వరుని ఉనికిని ఋజువు చేయడం సాధ్యం కాదు గనుకా, పరిణామము లేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్టికి కారణమని చెప్పడం అసంబద్ధం గనుకా.

తరువాతి కాలంలో సాంఖ్యవాదులు తమ యోగసిద్ధాంతాలలో "ఈశ్వరుడు" అనే తత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టారు.

                                     

2.2. సాంఖ్య తత్వము సృష్టి సిద్ధాంతం

సాంఖ్యం "సత్కార్యవాదం"ను సమర్ధిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణము, ఫలితము కలిసి ఉంటాయి. ఉన్నదేదీ నశించదు. లేనిదేదీ ఉత్పన్నం కాదు. అంతా పరిణామమే. అందుకు కారణంలో ఫలితం అంతర్లీనంగా ఉంటుంది. వీరి "ప్రకృతి పరిణామ వాదం" ప్రకారం మూల ప్రకృతి అన్నిటికీ కారణం. అదే క్రమంగా విభజితమై వివిధ పదార్ధాలుగా పరిణామం చెందుతుంది. చివరిలో అన్నీ మళ్ళీ అవిభాజిత మూల ప్రకృతిలో లీనమౌతాయి. ఇలా చక్రగతిలో విభజన, విలీనం సంభవిస్తాయి.

వైవిధ్యం, ఘర్షణ అనేవి ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలు. వీటివల్లనే ప్రకృతి 24 వేర్వేరు గుణాలు తత్వాలు గా విభజితమౌతుంది. ఆ గుణాలమధ్య ఉన్న మధనక్రియ పరిణామానికి మూలకారణం. ఇందుకు మూడు ముఖ్యమైన తత్వాలు.

 • సత్వము - సమతుల్యతను పెంపొందించే గుణము.
 • రజస్సు - వృద్ధిని, ప్రయత్నాన్ని పెంపొందిస్తుంది.
 • తమస్సు - అలసత్వాన్ని పెంచుతుంది. ప్రయత్నాన్ని నిరోధిస్తుంది.

సృష్టిలో అన్ని జీవులలో ఈ గుణాల వలన ఉత్పన్నమయ్యే లక్షణాలు:

 • పంచ తన్మాత్రలు
 • అహంకారం
 • మహత్
 • పంచ మహాభూతాలు
 • మనస్సు
 • పంచ జ్ఞానేంద్రియాలు
 • పంచ కర్మేంద్రియాలు
 • ప్రకృతి

ఈ గుణాల మధ్య తులనాన్ని బట్టి జీవుల, పదార్ధాల లక్షణాలు మారుతాయి. పరిణామం జరుగుతుంది. సాంఖ్య సిద్ధాంతాలు పతంజలి యోగసూత్రాలలోను, మహాభారతంలోను, యోగవాసిష్టం లోను విస్తృతంగా ప్రస్తావించబడ్డాయి.

అన్ని జీవులలోను ఆత్మ పురుషుని స్వరూపము. మనసు, బుద్ధి, అహంకారము ప్రకృతి లక్షణాలు.                                     

2.3. సాంఖ్య తత్వము మోక్షము

అజ్ఞానమే బంధాలకు, కష్టాలకు కారణం - అని మిగిలిన చాలా సిద్ధాంతాలలాగానే సాంఖ్యం కూడా చెబుతుంది. "పురుషుడు" అనగా జీవాత్మ శాశ్వతమైన, నిర్మలమైన చైతన్యము. ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమోగుణాలు, మనసు, అహంకారము, మహాత్‌లు ఈ జీవుని శరీరంలో బంధించివేస్తున్నాయి. జ్ఞానం వల్లం ఈ బంధం నుండి విముక్తులు కావచ్చును. అందువలన మోక్షం లభిస్తుంది.

ఇక్కడ సాంఖ్యానికి, వేదాంతానికి మధ్య విభేదాలను గమనించవలసి ఉంది. అద్వైత వేదాంతం ప్రకారం బ్రహ్మమే అన్నిటికీ కారణం. వేరే పదార్థం లేదు. కాని సాంఖ్యం ప్రకారం ప్రకృతి, పురుషుడు అనేవి రెండూ అనాదిగా వేర్వేరు. శాశ్వతమైన దానినుండి అశాశ్వతమైనది జనిస్తుందనే వాదాన్ని సాంఖ్యం అంగీకరించదు.

                                     

3. పాశ్చాత్య తత్వాలలో సాంఖ్యం

పాశ్చాత్య తత్వశాస్త్రంలో "కార్టీజియన్ సిద్ధాంతం" ప్రకారం శరీరం, మనసు అనేవి వేరు వేరు పదార్ధాలు. ఇది సాంఖ్యానికి కాస్త దగ్గరగా అనిపించినా కొన్ని ముఖ్యమైన భేదాలను గమనించాలి. పాశ్చాత్య తత్వ శాస్త్రంలో "శరీరం" అనేది భౌతిక పదార్థం. "మనసు" కనిపించని చైతన్యం. కాని సాంఖ్యంలో శరీరము, మనసు, అహంకారమూ కూడా ప్రకృతి లక్షణాలే. "జీవుడు" లేదా "ఆత్మ" అనేది మరింత అంతర్గతంగా ఉండేది అనవచ్చును.

వివరణ: పాశ్చాత్య తత్వం ప్రకారం కన్నులు శరీరంలో భాగం. చూసేది మనసు. సాంఖ్యం ప్రకారం కన్నులు, చూసేది కూడా శరీరమే. అలా చూసేదానికి "సాక్షి" మాత్రమే ఆత్మ

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →