Back

ⓘ విశ్వదర్శనం - భారతీయ చింతన                                               

విశ్వదర్శనం - పాశ్చాత్య చింతన

విశ్వదర్శనం అనే పేరుతో రెండు పుస్తకాలు వచ్చాయి. మొదటి పుస్తకం పాశ్చాత్య తత్వ చింతన గురించి చర్చిస్తుంది. రెండవదైన ఈ పుస్తకం భారతీయ తత్వ చింతన గురించి వివరిస్తుంది. ప్రపంచ దర్శన శాస్త్రాలను సంగ్రహంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ఈ రెండు పుస్తకాల ముఖ్యోద్దేశం. ఈ రెండు భాగాలు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1980 - 1996 సంవత్సరాల మధ్య కాలంలో కొంత విరామాలతో ధారావాహికగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలనే సంకలనం చేసి పుస్తకాలుగా విడుదల చేశారు. ఈ వ్యాసాలను రాయడానికి ప్రేరణ ఆంధ్రజ్యోతి వారపత్రిక మొదటి సంపాదకుడైన పురాణం సుబ్రహ్మణ్య శర్మ అని రచయిత ముందుమాటలో రాశాడు. మొదటి భాగంగా విడుదలైన పాశ్చాత్య చింతన వ్యాసాల ...

                                               

శ్వేతాశ్వతర

శ్వేతాశ్వతర ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు కృష్ణయజుర్వేద శాఖకు చెందినది. ఈ ఉపనిషత్తులో ఆరు అధ్యాయములు ఉన్నాయి. ఈ ఆరు అధ్యాయాల్లో మొత్తం 113 మంత్రములు ఉన్నాయి.ఈ ఉపనిషత్తు శ్వేతాశ్వతర బ్రహ్మర్షి తన శిష్యులకు బోధించగా ఆయన పేరిటనే ఈ ఉపనిషత్తు విఖ్యాతమైంది. శ్వేతాశ్వతరం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇంద్రియనిగ్రహం అని ఒక అర్థం, మంచి కోడెదుడ అని ఇంకొక అర్థం

                                               

సంహితము

సంహిత అనగా బాగా మేలు చేసేది అనిఅర్ధం. ప్రతి వేదంలోకూడా సంహిత ఉంటుంది. ప్రతి వేదంలోనూ నాలుగు విభాగాలుంటాయి. సంహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు

                                               

నండూరి రామమోహనరావు

నండూరి రామమోహనరావు తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా పేరొందాడు. చాలాకాలం పాటు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, ఆంధ్రపత్రిక లోనూ 1940 వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేయిన్ నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.

                                               

సామవేదము

చతుర్వేదాలలో ఒకటి సామవేదము. సామం అనగా మధురమైనది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. అంటే ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ.పూ 1000 వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది. వేదాల మధ్య సంబంధం వేదాలలో మూడు విధాలైన మంత్రాలున్నాయి - ఋక్కులు, యజుస్సులు, సామములు. ప్రత్యేమైన ఛందస్సులో ఉన్న పద్య శ్లోకం ఋక్. వచన రూపంలో ఛందస్సు లేకుండా ఉన్నను యజుస్సులు. గానానికి అనుగుణమైన పద్యశ్లోకం సామము. ఒకే శ్లోకం ఋక్కు ...

                                               

కేనోపనిషత్తు

ముక్తికోపనిషత్తు పేర్కొన్న ఉపనిషత్తులలో కేనోపనిషత్తు రెండవది. కేన అనగా ఎవరు? అని అర్ధము. భగవానుడు ఎవరు అనే చర్చ ఇందు వర్ణన చేయబడినది. "కేనేషితం పతతి." అని ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందుకే దీనికి "కేనోపనిషత్తు" అని పేరు వచ్చింది. ఇది నాలుగు భాగములుగా విభజింపబడి, మొదటి భాగమునందు 9 మంత్రములు, రెండవ భాగమునందు 5 మంత్రములు, మూడవ భాగమునందు 12 మంత్రములు, నాలుగవ భాగమునందు 9 మంత్రములు ఉన్నాయి.

                                     

ⓘ విశ్వదర్శనం - భారతీయ చింతన

విశ్వదర్శనం - భారతీయ చింతన నండూరి రామమోహనరావు విశ్వం యొక్క పుట్టుక గురించి భారతీయ తాత్విక చింతన ఎలా సాగిందో వివరించిన పుస్తకం. ఈ పుస్తకం మొదటి సంచిక 1997 జనవరిలో విడుదల కాగా 2003లో రెండవ సంచిక విడుదలయింది. రచయిత ఈ పుస్తకాన్ని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సిలర్ అయిన కొత్త సచ్చిదానందమూర్తికి అంకితమిచ్చాడు.

                                     

1. పూర్వరంగం

విశ్వదర్శనం అనే పేరుతో రెండు పుస్తకాలు వచ్చాయి. మొదటి పుస్తకం పాశ్చాత్య తత్వ చింతన గురించి చర్చిస్తుంది. రెండవదైన ఈ పుస్తకం భారతీయ తత్వ చింతన గురించి వివరిస్తుంది. ప్రపంచ దర్శన శాస్త్రాలను సంగ్రహంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ఈ రెండు పుస్తకాల ముఖ్యోద్దేశం. ఈ రెండు భాగాలు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1980 - 1996 సంవత్సరాల మధ్య కాలంలో కొంత విరామాలతో ధారావాహికగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలనే సంకలనం చేసి పుస్తకాలుగా విడుదల చేశారు. ఈ వ్యాసాలను రాయడానికి ప్రేరణ ఆంధ్రజ్యోతి వారపత్రిక మొదటి సంపాదకుడైన పురాణం సుబ్రహ్మణ్య శర్మ అని రచయిత ముందుమాటలో రాశాడు. మొదటి భాగంగా విడుదలైన పాశ్చాత్య చింతన వ్యాసాలు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలోనే వెలువడగా తర్వాతి సంపాదకులైన తోటకూర రఘు ఆధ్వర్యంలో రెండోభాగం భారతీయ చింతన వ్యాసాలు ప్రచురించబడ్డాయి.

ఈ పుస్తకం ప్రకారం భారతీయుల చింతనకు మూల పురుషులు ఆర్యులు. వారి పూర్వరంగంతో ప్రారంభించి వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం, చార్వాకం, భగవద్గీత మొదలైన వాటిని చర్చించి, జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఈ పుస్తకం ముగుస్తుంది. పశ్చిమ దేశాల తాత్వికులు పరలోకం కంటే ఇహలోకానికి ప్రాధాన్యమిస్తే భారతీయ తాత్వికులు అందుకు భిన్నంగా ఇహలోకం కంటే పరలోకానికి ప్రాధాన్యతనిచ్చారు.

                                               

విశ్వదర్శనం

విశ్వదర్శనం - భారతీయ చింతన - నండూరి రామమోహనరావు భారతీయ తత్వశాస్త్రంపై రాసిన పుస్తకం విశ్వదర్శనం - పాశ్చాత్య చింతన - నండూరి రామమోహనరావు పాశ్చాత్య తత్వశాస్త్రంపై రాసిన పుస్తకం

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →