Back

ⓘ ప్రకృతి శాస్త్రం                                               

పురావస్తు శాస్త్రం

పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధాలాల్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. ఇందుకోసం త్రవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, శాసనాలు, నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు. పురావస్తు శాస్త్రంలో రేడియోకార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు. ఈ శాస్త్రంలో మానవుల చరిత్ర, పూర్వ చరిత్ర గురించి అధ్యయనం చేస్తారు. అంటే తూర్పు ఆఫ్రికా, కెన్యాలో బయటపడ్డ 30 లక్షల సంవత్సరాల రాతిపనిముట్ల నుంచి ఇటీవలి కాలం నాటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస ...

                                               

వాయువు (భౌతిక శాస్త్రం)

వాయువు పదార్ధాల యొక్ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం, ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి. భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.

                                               

విజ్ఞాన చంద్రికా మండలి

సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, నాయని వేంకట రంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటివారు 1906 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. అప్పటివరకు తెలుగులో రచనలు సాహిత్యానికే అధికంగా పరిమితమై ఉండేవి. అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో విజ్ఞానశాస్త్రము, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించుట వారి లక్ష్యము. ఈ మండలి ప్రధానోద్దేశ్యము ఇలా చెప్పబడింది - స్వరాజ్యం కొఱకు ఆంధ్రదేశంలోను, యావద్భారతంలోను కూడా గాఢ వాంఛ ప్రబలియున్నది. కులమత భేదాలు లేక యుక్తవయసు వచ్చ ...

                                               

గణితము

గణిత శాస్త్రం, లెక గణితం అనగా పరిమాణములు, సంఖ్యలు, నిర్మానములు, స్థలాలు, మార్పుల యొక్క నైరూప్య అధ్యయనము. దానికి సాధారణంగా అంగీకరింపబడిన నిర్వచనము లేదు. గణిత శాస్త్రవేత్తలు క్రమాలను అన్వేషించి, వాటితో కొత్త ప్రతిపాదనలను రూపొందించుతారు. వారు ఆ ప్రతిపాదన యొక్క సత్యాన్ని లేక అసత్యాన్ని గణితశాస్త్ర ఆధరాలతో నిర్ధారిస్థారు. ఎప్పుడైతే గణిత నిర్మాణములు వాస్తవానికి మంచి నమూనాలు అవుతాయో, అప్పుడు గణిత తార్కికం ప్రకృతి యొక్క అంతర్దృష్టి లేక అంచనాలు అందించగలుతాయి. నైరూప్యత, తర్కం యొక్క వాడుకతో గణిత శాస్త్రం లెక్కించుట, గననము, కొలత, భౌతిక వస్తువుల యొక్క ఆకారకదలికల క్రమబద్ధమైన అధ్యాయనము నుంచి అభివృద్ధి చె ...

                                               

సహజ వనరులు

సహజ వనరులు) ఈ వాతావరణంలో మానవ ప్రభావం లేని ప్రదేశాలలో సహజంగా ఏర్పడతాయి. సహజ వాతావరణము ప్రకృతి పరిసర ప్రాంతాలు, వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు.ఈ సహజ వనరులనే ప్రకృతి వనరులు అని కూడా అంటారు. ఉదా: భూమి, నీరు, మత్స్య సంపద, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో భాగమే.ఇలా మనకు లభించే గాలి, నీరు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే అయితే భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి కానీ పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాము. ఈ పరిమితం అయిన సహజ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమా ...

                                               

అనగ్జిమాండర్

గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేల్స్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" అనే గ్రంధాన్ని రచించాడు.

ప్రకృతి శాస్త్రం
                                     

ⓘ ప్రకృతి శాస్త్రం

ప్రకృతి శాస్త్రం లేదా ప్రకృతి విజ్ఞాన శాస్త్రం అనే విజ్ఞానశాస్త్ర విభాగం పరిశీలనల ద్వారా, శాస్త్రీయమైన ఆధారాల ద్వారా ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలను వివరించడానికి, అర్థం చేసుకోవడానికి, ముందుగా జరగబోయే వాటిని ఊహించడానికి ఉపకరించే శాస్త్రం. ఈ శాస్త్రంలో ఒకే విధమైన ఫలితాలు మళ్ళీ మళ్ళీ రాబట్టడం, ఇతర శాస్త్రవేత్తలతో ఫలితాలు సరిచూసుకోవడం ద్వారా ప్రగతిని ప్రామాణికంగా నిర్ధారిస్తారు.

ప్రకృతి శాస్త్రాన్ని జీవ శాస్త్రాలు, భౌతిక విజ్ఞాన శాస్త్రాలు అని రెండు ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు. భౌతిక విజ్ఞాన శాస్త్రాలను ఇంకా భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగోళ శాస్త్రాలుగా విభజించవచ్చు. వాటిని మళ్ళీ ఉపవిభాగాలుగా, ప్రత్యేక విభాగాలుగా విభజించుకుంటూ పోవచ్చు.

పాశ్చాత్య దేశాల్లో అనుసరించే విశ్లేషణాత్మక సాంప్రదాయంలో ప్రయోగ పూర్వకమైన శాస్త్రాలను వివరించడానికి సాంప్రదాయ శాస్త్రాల ఉపకరణాలైన గణిత సమీకరణాలు, తర్కం మొదలైనవి వాడుకుని ప్రకృతిని గురించిన సమాచారాన్ని శాస్త్ర నియమాల రూపంలో పొందుపరుస్తారు. సమాజ విజ్ఞాన శాస్త్రాలు కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తాయి కానీ అవి గుణాత్మక పరిశీలనా పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తాయి కాబట్టి వాటిని సాఫ్ట్ సైన్సు అనవచ్చు. కానీ ప్రకృతి శాస్త్రాలు కొలవదగిన లేదా లెక్కించదగిన, పరీక్షించదగిన, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ధారించదగిన అంశాలను మాత్రమే పరిగణన లోకి తీసుకుంటాయి కాబట్టి వాటిని హార్డ్ సైన్సు అనవచ్చు.

ఆధునిక ప్రకృతి శాస్త్రాలు చాలావరకు పురాతన గ్రీకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ప్రకృతి తత్వశాస్త్రాలను ఆధారంగా ఏర్పడ్డవే. గెలీలియో, డెకార్ట్, ఫ్రాన్సిస్ బేకాన్, న్యూటన్ లాంటి శాస్త్రవేత్తలు శాస్త్రపరిశోధనకు గణిత శాస్త్ర నియమాలు, ప్రయోగాలు లాంటి పద్ధతులు వాడటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలున్నాయని వాదించారు. కానీ ఇప్పటికీ తత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని సూత్రాలు, పూర్వభావనలు కూడా శాస్త్ర పరిశోధనకు అవసరమవుతున్నాయి. 16 వ శతాబ్దంలో ప్రకృతి చరిత్రలో భాగంగా ప్రారంభమైన జంతువుల, వృక్షాల, ఖనిజాల మొదలైన వాటి వర్గీకరణ నెమ్మదిగా డిస్కవరీ సైన్సు గా రూపుదిద్దుకుంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →