Back

ⓘ పంజాబీ సంస్కృతి                                               

పంజాబీ కిస్సే

పంజాబీ కిస్సా అనేది ఒక కథచెప్పే విధానం. ఇది అరేబియా ద్వీపకల్ప దేశాలు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన ముస్లిం దేశాల నుండి వలస వచ్చిన ప్రజలద్వారా దక్షిణాసియా దేశాలలో ప్రవేశించింది. కిస్సా ఇస్లామిక్, పర్షియన్ వారసత్వంగా ఆరంభమైంది. ఇందులో ముస్లిం ప్రజలలోని ప్రేమ, వీరం, విశ్వాసం, నీతి మొదలైన భావాలు ప్రతిఫలిస్తాయి. ఇది భారతదేశానికి చేరే సమయానికి మతసరిహద్దులు దాటి మతసామరస్య భావాలతో విస్తరుంచింది. ముస్లిం పాలనకు ముందున్న పజాబీ సంస్కృతి, జానపదాలలో కిస్సా సంప్రదాయం మిశ్రితమైంది.

                                               

పంజాబీ భాష

పంజాబీ / p ʌ n ˈ dʒ ɑː b i / ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో ఉన్న భాష. పాకిస్తాన్ తూర్పు ప్రాంతం, భారత దేశపు ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించివున్న చారిత్రికమైన పంజాబ్ ప్రాంతంలోని పంజాబీలకు ఇది మాతృభాష. కంఠస్వరం, ఉచ్చారణ మారితే పదం అర్థం మారేలాంటి టోనల్ భాష పంజాబీ. మొత్తం ఇండో-యూరోపియన్ భాషలన్నిటిలోనూ పంజాబీనే పూర్తిస్థాయి టోనల్ భాష. పంజాబీ పాకిస్తాన్ లో అత్యంత విస్తారంగా మాట్లాడే భాష, భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల స్థానాల్లో పదకొండవది, భారత ఉపఖండంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో మూడవ స్థానంలో ఉంది. అతి ఎక్కువ ...

                                               

పంజాబీ కేలండరు

పంజాబీ కేలండరు విక్రమాదిత్య రాజు నుండి వచ్చిన బిక్రమి కేలండరు ఆధారంగా రూపొందించబడి క్రీ.పూ 57 నుండి మొదలయింది. ఈ కేలండరు బిక్రమి కేలండరులోని సౌర అంశాల కోసం ఉపయోగపడుతుంది. దీనిలో వైశాఖిలోని మొదటి రోజును పంజాబీలు కొత్త సంవత్సర దినంగా "వైశాఖి"గా జరుపుకుంటారు.

                                               

పంజాబీ సంగీతం

పంజాబ్ అన్నది భారత ఉపఖండంలో పశ్చిమ పంజాబ్, తూర్పు పంజాబ్ ల నడుమ విభజితమైన ప్రాంతం. పంజాబీ సంగీతం విస్తారమైన విభిన్న శైలిని కలిగివుంది. వీటిలో జానపద సంగీతం నుంచి హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం వరకూ ఉన్నాయి. హిందుస్తానీ సంగీతంలో ఇక్కడి వైవిధ్యభరిత రూపాన్ని పటియాలా ఘరానా అని పిలుస్తారు.

                                               

పంజాబీ పండుగలు

పంజాబీ ప్రజలు అనేక పండగలను జరుపుకుంటారు. వాటిలో మతపరమైనవి, సంస్కృతి పరమైనవి ఉన్నాయి. ఈ సాంస్కృతిక పండగలను అన్ని మతాల ప్రజలు కూడా జరుపుకుంటారు. ఈ పండగల గూర్చి పంజాబీ కాలెండరును ఉపయోగిస్తారు. ఈ క్రింది జాబితాలో పంజాబీ పండగలున్నాయి.

                                               

పంజాబీలు

పంజాబీలు, లేదా పంజాబీ ప్రజలు, పాకిస్తాన్, ఉత్తర భారతదేశాల్లో విస్తరించిన పంజాబ్ ప్రాంతానికి చెందిన ఇండో-ఆర్యన్ జాతికి చెందిన ప్రజలు. పంజాబ్ అన్న పేరుకు ఐదు జలాల భూమి ఆబ్. ఈ ప్రాంతానికి ఆ పేరును భారత దేశాన్ని ఆక్రమించిన తుర్కో-పర్షియన్ విజేతలు పెట్టగా, మొఘల్ పాలనా కాలంలో ప్రాచుర్యం పొందింది. భారత్, పాకిస్తాన్ ఇరుదేశాల్లోనూ పంజాబ్ ధాన్యాగారంగా పేరొందింది. పంజాబ్ ప్రాంతంలోని వివిధ తెగలు, కులాలు, మతాలకు చెందిన నివాసులను విస్తృతమైన సాధారణపదం పంజాబీ అన్నది వాడడం 18వ శతాబ్ది ప్రారంభం నుంచి మొదలైంది. దీనికి ముందు పంజాబ్ ప్రాంతంలో భాషాపరమైన, చారిత్రికమైన, జాతిపరమైన సామాన్య లక్షణాలు, సాధారణ చరిత్ర ప ...

                                     

ⓘ పంజాబీ సంస్కృతి

ఆధునిక కాలంలో పంజాబీప్రజలు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న కారణంగా ప్రత్యేకంగా భారతదేశం, పాకిస్తాన్ పంజాబీ సంస్కృతి అనేక మందికి పరిచయమై ప్రభావం చూపుతుంది. సంప్రదాయమైన పంజాబీ సంస్కృతి శక్తివంతమై పశ్చిమదేశాల వరకు విస్తరించింది. పంజాబీ సంస్కృతి యునైటెడ్ స్టేట్స్, యు.కే, యురేపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా వరకు విస్తరించింది. పంజాబీ తాత్వికత, కవిత్వం, ఆధ్యాత్మికత, విద్య, కళలు, సంగీతం, ఆహారసంస్కృతి, నిర్మాణకళ మొదలైనవి వెలుపలి ప్రపంచంలో మరింత ప్రభావం చూపుతుంది. పలు భాషలకు, సంస్కృతులకు, అలవాట్లకు, జాతులకు చెందిన ప్రజలు పలు కారణాల వలన పంజాబు చేరుకున్నారు. ఈ ప్రజలు పంజాబీ సంస్కృతి ప్రభావితులైయ్యారు.

                                     

1. పంజాబీ సంగీతం

భంగారా పలు పంజాబీ సంగీతరూపాలలో ఒకటి. దీనిని పాశ్చాత్యదేశాలలో అభిమానించేవారి సంఖ్య అధికరిస్తూ ఇది అభిమాన పంజాబీ సంగీతంగా మారింది. పంజాబీ సంగీతాన్ని ఇతర సంగీతరూపాలతో మిశ్రితం చేసి పశ్చిమదేశాలలో ప్రాబల్యత సంతరించి అవార్డ్ - విన్నింగ్ సంగీతంగా చేయబడింది. అదనంగా పంజాబీ సంప్రదాయసంగీతానికి పశ్చిమదేశాలలో ఆదరణ అధికరిస్తూ ఉంది.

                                     

2. పంజాబీ నృత్యాలు

దీర్ఘకాలచరిత్ర కలిగిన పంజాబీ సంస్కృతి, పంజాబీ ప్రజలలో పలు నృత్యరీతులు రూపొందించబడ్డాయి. ఇవి సాధారణంగా పండుగలు, వివాహాది వేడుకలు, పంటలు చేతికి అందిన వేళలలో ప్రదర్శించబడుతుంటాయి. నృత్యాలకు మసంబంధిత, మతేతర నేపథ్యం ఉంటాయి. ఉత్సాహవంతమైన పురుషుల నృత్యం భంగారా నృత్యం అలాగే ఝుమర్, గిధా నృత్యాలు స్త్రీలకు ప్రత్యేకించబడ్డాయి.

                                     

3. పంజాబీ వివాహం

పంజాబీలు జరుపుకునే వివాహ సంప్రదాయాలు, వేడుకలలో పంజాబీ సంస్కృతి బలంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. ముస్లిములు, హిందువులు, సిక్కులు, జైనులు తమవివాహాది వేడుకలను అరబిక్, పంజాబీ, సంస్కృత్, ఖాజీ, పండిట్, గ్రాంథి, లేక పూజారి చేత నిర్వహించబడుతుంది. ఆచారాలు, పాటలు, నృత్యం, ఆహారం, దుస్తులలో కొంత సారూప్యత ఉంటుంది. పంజాబీ వివాహాలలో పలు ఆచారాలు చోటుచేసుకుంటాయి. వేడుకలు వివాహాలు పురాతన సంప్రదాయకాలం నాటివి ఇప్పటికీ ఆచరించబడుతున్నాయి.

                                     

4. పంజాబీ ఆహారం

పంజాబీ ఆహారసంస్కృతిలో విస్తారమైన ఆహారాలు ఉన్నాయి. ఆహారరంగంలో ఇది ప్రపంచస్థాయిలో ఆధీనత సాధించింది. పంజాబీ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ కారణంగా పలువురు వ్యాపార వేత్తలు ప్రపంచవ్యాప్తంగా పంజాబీ ఆహారరంగంలో పెట్టుబడులు పెట్టారు.ఉదాహరణగా సర్సో కా సాగ్, మక్కీ దీ రోటీ వంటి ఆహారాలు మరింత ప్రాబల్యత సంతరించుకున్నాయి. చోళే బటూరా కూడా పంజాబీ ఆహారాలలో మరింత ఆదరణ అందుకున్నది. అత్యంత ఆదరణ పొందిన పంజాబీ ఆహారాలలో నాన్, బటర్ చికెన్, మటర్ పనీర్, తందూరి చికెన్, సమోసాలు, పకోడాలు ప్రధానమైనవి. దాదాపు అన్ని ఆహారాలకు పెరుగు ఆధరువు సైడ్ డిష్ గా వాడుకలో ఉంది. పంజాబులో పలు తీపి తినుబండారాలు వాడుకలో ఉన్నా రసగుల్లా, బర్ఫీ, గులాబ్ జామూన్ అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్నాయి.

                                     

5. పంజాబీ సాహిత్యం

పంజాబీ కవిత్వం లోతైన అర్ధానికి, సౌందర్యానికి, ఉత్సాహం, చక్కని పదప్రయోగానికి పేరుపొందింది. పంజాబీ ప్రజల మనసులో కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. పంజాబీ సాహిత్యం అధికంగా పలుభాషలలో అనువదించబడి ప్రపంచం అంతటా విస్తరించింది. పంజాబీ సాహిత్యంలో గురుగ్రంధ్ సాహెబ్ గ్రంథం అత్యంత ప్రధానమైనది.

                                     

6. పంజాబీ దుస్తులు

పంజాబీ సంప్రదాయ దుస్తులలో ప్రధానమైన పంజాబీ దుస్తులు పురుషులు, స్త్రీలు కూడా ధరిస్తుంటారు. ప్రస్తుతం దీనిని స్థానంలో కుర్తా ఫైజమా చోటు చేసుకున్నాయి. పంజాబు స్త్రీల సంప్రదాయ దుస్తులలో పంజాబీ సల్వార్ సూటు ప్రధానమైనది. ప్రస్తుతం దీని స్థానాన్ని పంజాబీ ఘాగ్రా భర్తీ చేసింది. పంజాబులో పాటియాలా సల్వార్ కూడా ప్రజాదరణ కలిగి ఉంది.

                                     

7. పంజాబీ పండుగలు

పంజాబీ ప్రజలు సాంస్కృతిక, సీజనల్, మతసంబంధిత పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగలలో మాఘి, మేళాచిరాఘన్, లోహ్రి, హోళీ, బైసఖీ, తీయాన్, దీపావళి, దసరా, గురునానక్ జయంతి ప్రధానమైనవి.

                                     

8. మూలాలు

 • The Legacy of The Punjab by R. M. Chopra, 1997, Punjabee Bradree, Calcutta.
 • History of Porus, Patiala, Buddha Parkash.
 • Wrestling in Punjab Documentary Film, on History of Wrestling in Punjab by Filmmaker Simran Kaler.
 • The evolution of Heroic Tradition in Ancient Panjab, 1971, Buddha Parkash.
 • The Punjab as a sovereign state, Gulshan Lal Chopra, Al-Biruni, Lahore, 1977.
 • Patwant Singh. 1999. The Sikhs. New York: Doubleday. ISBN 0-385-50206-0.
 • History of the Panjab, Patiala, 1976, Fauja Singh, L. M. Joshi Ed.
 • Nanak, Punjabi Documentary Film by Navalpreet Rangi
 • Social and Political Movements in ancient Panjab, Delhi, 1962, Buddha Parkash.
                                     

9. వెలుపలి లింకులు

 • Video about Punjab and Punjabi music from the Horniman Museum
 • Punjabi Newspaper
 • Punjabi News website
 • Punjabi Heritage Organization of Chicago
 • Punjabi American Heritage Society
 • Punjabi Cultural Society of Chicago
 • Punjab Heritage

మూస:Punjab, India

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →