Back

ⓘ హుసేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్



                                               

హైదరాబాదులో ప్రదేశాలు

హైదరాబాదు నగరంలో ఉన్న వివిధ ప్రదేశాల గురించి ఈ వ్యాసంలో చదువవచ్చును. హైదరాబాదులో చాలా ప్రదేశాలకు చివరన ఆబాద్ అని, గూడ అన్న పదాలు వస్తాయి. భాగ్యనగరం, అత్రఫ్-ఎ-బల్దాలు నగరానికి పూర్వపు పేర్లు. మొఘల్‌ చక్రవర్తి ఔరంగాజీబు నియామకం చేసిన మొదటి సుబేదారు ముబారెజ్‌ఖాన్‌ హయాంలో. హైదరాబాద్‌ నగరం చుట్టూ ప్రాకారం నిర్మించాడు. దానిని హైదరాబాదు సరిహద్దు గోడ అని పిలుస్తారు.

హుసేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్
                                     

ⓘ హుసేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్

భారతదేశంలోని దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తోన్న హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ బహుళ ప్రజాదరణ పొందిన రైలు సర్వీసు. ఈ రైలు హైదరాబాద్, ముంబయి మధ్య నడుస్తుంది. 1993లో ఈ రైలు ప్రారంభమైంది. అప్పట్లో దాదర్ - హైదరాబాద్ మధ్య ఇది వారానికి రెండుసార్లు మాత్రమే నడిచేది. హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ అనతికాలంలోనే ప్రతిరోజు నడిచే రైలు సర్వీసుగా మారింది.

                                     

1. చరిత్ర

భారతదేశంలోని హైదరాబాద్ సంస్థానాన్ని ఇబ్రహీం కులీకుతుబ్ షా పాలిస్తున్న సమయంలో 1562లో హజ్రత్ హుస్సేన్ షా వలీ హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మించారు. ప్రస్తుతం ఈ సరస్సు పేరుతోనే రైలును నడిపిస్తున్నారు. గతంలో బాంబే-వీటీ, సికింద్రాబాద్ మధ్య నడిచే 2101/2102 నెంబర్లు గల మినార్ ఎక్స్ ప్రెస్ స్థానంలో 1994 నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైలు నడుస్తోంది. ప్రస్తుతం దీని నెంబర్లు 2701/2702.

                                     

2. రైలు సంఖ్య

12701: ముంబయి సి.ఎస్.టి. - హైదరాబాద్ డెక్కన్ హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్

12702: హైదరాబాద్ Decan - ముంబయి సి.ఎస్.టి. హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్

ఈ రైలు మొత్తం 429 మైళ్ల దూరం 790 కి.మీ. దూరాన్ని 13 గంటల 45 నిమిషాల వ్యవధిలోప్రయాణిస్తుంది. దీని సగటు వేగం 58.7 కిమీ/గం.

                                     

3. పెట్టెల వివరములు

12701 హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ రైలులో బోగీల విభజన ఈ విధంగా ఉంటుంది: ENG-SLR-GEN-S10-S9-S8-S7-S6-S5-S4-S3-S2-S1-B2-B1-A1-HA1-GEN-SLR

12702 హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ రైలులో బోగీల విభజన ఈ విధంగా ఉంటుంది:

ENG-SLR-GEN-GEN-GEN-GEN-S1-GEN-GEN-SLR

ఈ రైలు హైదరాబాద్ ముంబయి ఎక్స్ ప్రెస్ తో రేక్ లు పంచుకుంటుంది.

                                     

4. ఇంజిన్లు

హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ రైలును లాగేందుకు మొదట్లో డబ్ల్యు.సి.ఎం. రైలింజన్ ఉపయోగించేవారు. ఆ తర్వాత WCAM3/WCG2 ఇంజన్లను సి.ఎస్.టి. ముంబయి, పుణె మధ్య ఉపయోగిస్తున్నారు. డీసీ నుంచి ఏసీకి మార్చడం ప్రారంభించిన తర్వాత పుణె నుంచి కల్యాణ్ వరకు దక్షిణ మధ్య రైల్వే కాజీపేట KZJ యొక్క డీజిల్ లోక్ షెడ్ నుంచి తీసుకుని సింగిల్ WDM3A డీజిల్ లోకోమోటివ్ వాడుతున్నారు. 2013 మధ్య సంవత్సరం నుంచి మధ్య రైల్వేకు చెందిన కల్యాణ్ షెడ్ నుంచి WDM3A/D లేదా WDG 3 లోకొమొటివే ఇంజన్లను హైదరాబాద్, ముంబయి సి.ఎస్.టి. మధ్య జరిగే మొత్తం ప్రయాణంలో వాడుతున్నారు.

                                     

5. బయటి లింకులు

సమాచారం

  • భారతీయ రైలు సమాచారం: హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్2702
  • భారతీయ రైలు సమాచారం: హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్2701
  • హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్.

ఆర్టికల్స్ & సమీక్షలు

  • Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన రైలు నెంబర్లు, రైలు సమయాలు.
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →