Back

ⓘ వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు                                               

వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు

తెలుగు భాషకి, ఆధునిక అవసరాలకి సరిపోయే, ఒక నిఘంటువు dictionary, పర్యాయపద కోశం thesaurus, శైలి లక్షణ గ్రంథం style manual ఉండాలన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు కాలంతో మారుతూన్న భాష స్వరూపానికి అద్దం పడుతూ ఒక ఆధునిక వ్యాకరణం కూడా ఉంటే బాగుంటుంది. మాతృభాష అబ్బినంత తేలికగా, దేశ భాషలు నేర్వగలిగినంత తేలికగా, పాశ్చాత్య భాషలలో పాండిత్యం రాదు. మేథా వర్గాలలో ఉన్న బహుకొద్ది శాతం ఇంగ్లీషు తప్పనిసరి అని ఎంతగా అనుకున్నా, ప్రజలందరినీ - పండితుల నుండి పామరుల దాకా, అందరినీ - ఇంగ్లీషు నేర్చేసుకోమంటే అది జరిగే పని కాదు. కనుక ఈ నాటి శాస్త్రం, సాంకేతికం, వైద్యం, వ్యాపారం., ఇలా ఏ రంగంలోనైనా ఆవిష్కరణ జరుగుతూన్న క్ర ...

                                               

నిఘంటువు

నిఘంటువు (అనగా ఆక్షర క్రమములో పదములు, వాటి అర్థములు కలిగినది. దీనినే పదకోశము, వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. తెలుగు భాష యందు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు సవర పదకోశం చేశారు.

                                               

వేమూరి (అయోమయనివృత్తి)

వేమూరి లేదా వేమూరు తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. వేమూరి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన సంపాదకులు, మేనేజింగ్ డైరెక్టర్. వేమూరి సత్యనారాయణ, జ్యోతి మాసపత్రిక సంపాదకవర్గ సభ్యుడు. వేమూరి వేంకటేశ్వరరావు వృత్తిరీత్యా, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో ఉన్నారు. వేమూరి నరసింహారెడ్డి, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. వేమూరి శ్రీనివాసరావు, పూర్వగాథాలహరి రచయిత. వేమూరి రామయ్య, సుప్రసిద్ధ నాటక కళాకారులు. వేమూరి బలరామ్, స్వాతి వారపత్రిక సంపాదకులు వేమూరి విశ్వనాథశర్మ, ఆంగ్ల, సంస్కృత, ఆంధ్ర భాషా పండితులు, విజ్ఞాన శాస్త్రవేత్త వేమూరి రామకృష్ణ ...

                                               

వేమూరి వేంకటేశ్వరరావు

వేమూరి వేంకటేశ్వరరావు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందాడు.

                                               

ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు

తెలుగులో వైజ్ఞానిక విషయాల రాసే వారికి వైజ్ఞానిక విషయాల మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు వేరుగా వుంటాయి. తెలుగులో పారిభాషిక పదజాలం లేదని ఇంగ్లీషు పదబంధాల మధ్య తెలుగు క్రియావాచకాలని జొప్పించతే వచ్చే భాష తెలుగూ కాదు, ఇంగ్లీషూ కాదు. అటువంటి భాష వాడితే వ్యాసాల ప్రయోజనం, భాషా ప్రయోజనం నెరవేరదు. వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఉన్న ఇంగ్లీషు వ్యాసాలను తెలుగులోకి అనువదించడంలో ప్రధాన సమస్య పారిభాషిక పదజాలం. వేమూరి గా ...

                                               

భౌతిక శాస్త్రము

భౌతిక శాస్త్రము అంటే ఏమిటి? పదార్థము, శక్తి అనే రెండింటి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని అధ్యయనం చేసేదే భౌతిక శాస్త్రం. శక్తి యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే భౌతిక శాస్త్రం. ఈ శక్తి మనకి అనేక రూపాల్లో అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఇది చలన రూపంలోను, వేడి రూపంలోను, వెలుగు రూపంలోను, విద్యుత్ రూపం లోను, వికిరణం రూపంలోను, గురుత్వాకర్షణ రూపంలోను – ఇలా అనేక రూపాల్లో మనకి తారసపడుతూ ఉంటుంది. భౌతిక శాస్త్రం అంటే మన చుట్టూ వున్న ప్రకృతిలో అనేకమైన దృగ్విషయాలను గురించిన అధ్యయనం. భౌతిక శాస్త్రము విశ్వములో మౌలిక పదార్థములు, వాటి మధ్య ప్రాథమిక చర్యలను క్షుణ్ణంగా అర్థము చేసుకునే మౌలిక సూత్రా ...

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు
                                     

ⓘ వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు

తెలుగు భాషకి, ఆధునిక అవసరాలకి సరిపోయే, ఒక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు dictionary, పర్యాయపద కోశం thesaurus, శైలి లక్షణ గ్రంథం style manual ఉండాలన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు కాలంతో మారుతూన్న భాష స్వరూపానికి అద్దం పడుతూ ఒక ఆధునిక వ్యాకరణం కూడా ఉంటే బాగుంటుంది.

మాతృభాష అబ్బినంత తేలికగా, దేశ భాషలు నేర్వగలిగినంత తేలికగా, పాశ్చాత్య భాషలలో పాండిత్యం రాదు. మేథా వర్గాలలో ఉన్న బహుకొద్ది శాతం ఇంగ్లీషు తప్పనిసరి అని ఎంతగా అనుకున్నా, ప్రజలందరినీ - పండితుల నుండి పామరుల దాకా, అందరినీ - ఇంగ్లీషు నేర్చేసుకోమంటే అది జరిగే పని కాదు. కనుక ఈ నాటి శాస్త్రం, సాంకేతికం, వైద్యం, వ్యాపారం., ఇలా ఏ రంగంలోనైనా ఆవిష్కరణ జరుగుతూన్న క్రొంగొత్త విషయాల గురించి తెలుగులో చెప్పవలసిన అవసరం ఉంది. సెల్ ఫోనుల వాడకం దగ్గరనుండి, రైలు టికెట్టు కొనుక్కోడం దాకా ఇంగ్లీషులోనే పని జరగాలంటే ఎలా?

ఆధునిక అవసరాలకి తెలుగుని వాడేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏ విషయం గురించి ఏది రాయాలన్నా తెలుగు వాళ్ల బుర్రకి ఇంగ్లీషు మాట తట్టినంత జోరుగా తెలుగు మాట తట్టదు. తెలుగులో పదసంపద లేకపోలేదు. వేళకి సరి అయిన మాట తట్టకపోవడమే పెద్ద సమస్య. పత్రికా విలేఖరులు, చలా చిత్రాలకి సంభాషణలు రాసే వారు, విద్యుత్ ప్రసార మాధ్యమాలలో మాట్లాడే లంగరయ్యలు, లంగరమ్మలు సరి అయిన, సులభమయిన తెలుగు వాడకపోతే వ్రతం చెడుతుంది, ఫలం దక్కదు.

ఇటువంటి నిత్యావసరాలు ప్రేరణ కారణాలు కాగా, ఆధునిక సాంకేతిక శాస్త్రాన్ని నలుగురికీ అర్థమయే తేలిక శైలిలో చెప్పాలనే కోరిక శ్రీ వేమూరికి 1967 లో పుట్టింది. అప్పటి నుండి తెలుగులో శాస్త్రం గురించి, తెలుగు భాష మీద ఎన్నో వ్యాసాలు, కథలు, పుస్తకాలు రాస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయనకి అవసరమైన పదజాలాన్ని - స్వయంబోధకంగా ఉండేటట్లు - ఆయనే సమకూర్చుకునేవారు. మొదట్లో చిల్లర కాగితాల మీద రాసుకున్న ఈ పదజాలం, ఇంతింతై, ఎంతో పెద్దదై, వందల కొద్దీ కాగితాలు నిండిపోయాయి. కంప్యూటర్లు కొత్తగా వస్తూన్న ఆ రోజులలో, తెలుగు ఖతులు అప్పుడప్పుడే పుడుతూన్న ఆ కాలంలో, ఈనాటి సాంకేతిక వెసులుబాట్లు లేని ఆ రాతియుగంలో మొదలు పెట్టిన ఈ ప్రయత్నాన్ని చూసి స్నేహితులు అచ్చు కొట్టించమని హితోపదేశం చేసేరు. అదే 2002 లో ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుగా వెలువడింది. గత 12 సంవత్సరాలలో ఈ నిఘంటువులో చొరబడ్డ అచ్చు తప్పులు సరిదిద్దడం, కొత్త మాటలు చేర్చడం వంటి పనులతో ఈ నిఘంటువుని మెరుగు పెరిగి పెద్దదయింది. అచ్చు ప్రతిలో కంటే ఆయన వద్ద ఉన్న కంప్యూటర్లో ఉన్న మూల ప్రతిలో కనీసం 25 శాతం ఎక్కువ మాటలు, తక్కువ తప్పులు ఉన్నాయి. ఇలా మెరుగు పరచిన నిఘంటువులో ఇంగ్లీషు-తెలుగు భాగాన్ని వికీపీడియా చదువరుల ముందు ఉంచుతున్నాం.

నిఘంటు నిర్మాణం ఒకరి వల్ల అయే పని కాదు. నిఘంటువు వాడుకలో ఉన్న మాటలని అక్షరబద్ధం చేయగలదు కాని, వాడుకని శాసించలేదు. భాష వాడుతూన్నకొద్దీ వాడితేరుతుంది; వాడకపోతే వాడిపోతుంది. ఈ నిఘంటువులో ప్రయోగాత్మకంగా వాడిన మాటలు చాల ఉన్నాయి. ఇవి అన్నీ వేమూరి వారి స్వకపోలకల్పితాలు కావు. పలువురు అరుదుగా వాడిన మాటలు, మరుగున పడిపోతూన్న మాటలు, పాత మాటలని కొత్త అర్థాలతో వాడినవి కూడా ఉన్నాయి. ఆసలు మాటలు ఎలా పుడతాయి? ప్రజలు పుట్టిస్తే పుడతాయి. ఎప్పుడు పుడతాయి? వాడుకలో అవసరమైనప్పుడు సందర్భోచితంగా పుడతాయి కాని కమిటీలలో కాదు. అందుకని తెలుగులో రాయాలని కోరిక ఉన్న వారి సౌకర్యం కోసం ఈ నిఘంటువుని వారు తయారు చేసేరు. ఇచ్చిన ఇంగ్లీషు మాటకి సమానార్థకమైన తెలుగు మాటలకీ, వాటిని ఉపయోగించే తీరుకీ పెద్ద పీట వేసేరు.

                                     

1. ఇతర లింకులు

  • వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి: ఆధునిక అవసరాలు, తెలుగుభాషా పత్రిక, సం. 3, స. 2, పు. 9-13, అక్టోబరు 1973.
  • వేమూరి వేంకటేశ్వరరావు, శిష్టవ్యవహారికం, తెలుగు జ్యోతి నూ జెర్సీ, పు. 23, ఫిబ్రవరి 1992 & 4వ ప్రపంచ తెలుగు మహాసభ ప్రత్యేక సంచిక,నూ యార్క్, పు. 484, జూలై 1992.
  • వేమూరి వేంకటేశ్వరరావు 2014-05-01. "వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు". ఈమాట ఇ-పత్రిక. Archived from the original on 2015-04-24.
  • వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి సూక్ష్మీకరణ, రచన ఇంటింటి పత్రిక, పు. 9-11, నవంబరు 1995.
  • వేమూరి వేంకటేశ్వరరావు, ఇతర భాషలలోని మాటలని తెలుగులో ఉచ్చరించడం, తెలుగు జ్యోతి నూ జెర్సీ, పు. 23-25, మే 1997.
  • వేమూరి వేంకటేశ్వరరావు, అమెరికాలో తెలుగు నేర్పడం, తెలుగు జ్యోతి నూ జెర్సీ, పు. 13-19, ఆగస్టు 1994.
  • వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగులో అక్షరాలు ఏవేమిటి?, తెలుగు జ్యోతి నూ జెర్సీ, పు. 16-17, జూన్ 1997 & రచన ఇంటింటి పత్రిక, పు. 74-75, మార్చి 2000.
  • వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి స్థాయీకరణ, రచన ఇంటింటి పత్రిక, పు. 60-64, అక్టోబరు 1996.
  • వేమూరి వేంకటేశ్వరరావు, పారిభాషా పదాల తెలుగు అనువాదానికి కొన్ని సలహాలు, తెలుగు పలుకు, 5వ. ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం, లాస్ ఏంజిలిస్, 5-7 జూలై 1985,
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →