Back

ⓘ పుల్లెల శ్రీరామచంద్రుడు                                               

లఘుసిద్ధాన్తకౌముదీ

లఘుసిద్ధాన్తకౌముదీ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు వ్రాసిన సంస్కృత వ్యాకరణమునకు సంబంధించిన తెలుగు పుస్తకము. దీనికి ఆయన గురువైన కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి ఆశీర్వాదాలనిచ్చి దీవించాడు. దీనిలో సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన 1.275 సూత్రాలను రచయిత ఆంధ్రీకరించడమే కాకుండా వ్యాఖ్యాన రూపముగా వివరణను కూడా తెలియజేసి, కౌముదీపాఠ సాంప్రదాయమును అనుసరించెను. ముందుగా సంస్కృత వ్యాకరణము - దాని సంక్షిప్తచరిత్ర గురించి 46 పేజీలలో వివరంగా తెలియజేశారు. చివరగా సూత్రసూచీ, ధాతుసూచీ లను కూడా చేర్చారు. ఇది 1971 లో మొదటిసారిగా ముద్రించబడి; 1980, 1998 లలో ద్వితీయ, తృతీయ ముద్రణలను విడుదలచేసింది. దీనిని జి. పుల్లారెడ్డి చారిట ...

                                               

అక్టోబర్ 24

1933: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. మ.2010 1927: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. మ.2015 1930: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. మ.2014 1953: నర్రా విజయలక్ష్మి, అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు. 1965: ఇయాన్ బిషప్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980: కౌషికి చక్రబొర్తి, భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి.

                                               

జూన్ 24

1924: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. మ.1991 1902: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. మ.1946 1940: మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత. 1928: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. మ.2015 1915: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. మ.1983 1964: విజయశాంతి, తెలుగు సినిమా నటి. 1896: జి.వి. కృపానిధి, పలు ఆంగ్లపత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. మ.1970 1967: ఎం.చంద్రశేఖర్, 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు. 1902: జమిలి నమ్మాళ్వార ...

                                               

1927

: బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. మ.2004 అక్టోబరు 10: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. మ.2014 జూన్ 24: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. మ.2007 ఆగష్టు 20: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. మ.2005 జనవరి 2: మల్లవరపు జాన్, తెలుగు కవి. మ.2006 జూలై 5: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. మ.2013 ఫిబ్రవరి 28: కృష్ణకాంత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. ఆగష్టు 24: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. మ.2014 జనవరి 31: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట ...

                                               

తెలుగు రథం

తెలుగు రథం - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ హైదరాబాద్ లో 2008 అక్టోబరు 24 న ప్రారంభం అయింది. ఈ సంస్థకు కొంపెల్ల శర్మ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, జనపదం, వికాసం, ఆధ్యాత్మికం - అనే రంగాలను సంస్థ కార్యక్రమాలను నిర్వహించుకునే సౌలభ్యం కోసం ప్రాతిపదికగా నిర్మాణం చేసుకోవడం ప్రణాళికలో భాగంగా నిర్థారింపబడ్డాయి. సంస్థ కార్యక్రమాల ప్రస్థాన శైలి కోసం కూడా - "సప్త దృక్పథ" నిర్మాణం - ప్రస్తావన, ప్రవేశం, ప్రతిభ, ప్రయోగం, పరిశీలనం, ప్రస్తారం, ప్రభావం - అని స్థూలంగా చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ హైదరాబాదులో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో పలుప్రాంతాలలో అనేక కార ...

                                               

యువభారతి

చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటె ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది అనే ధ్యేయంతో 1963లో విజయదశమి అక్టోబరు 27 నాడు యువభారతి ఆవిర్భవించింది. ఇరివెంటి కృష్ణమూర్తి దీనిని స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు. మొదట ఈ సంస్థ కార్యస్థానం సికిందరాబాదులోని కింగ్స్‌వేలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాదు లోని బొగ్గులకుంట ప్రాంతంలో ఈ సంస్థ కార్యాలయం ఉంది. ప్రస్తుతం వంగపల్లి విశ్వనాథం ఈ సంస్థకు సమావేశ కర్త గా, డా. ఆచార్య ఫణీంద్ర అధ్యక్షుడిగాను, జీడిగుంట వెంకట్రావు కార్యదర్శిగాను వ్యవహరిస్తున్నారు.ఈ సంస్థ ప్రచురించే ప్రచురణల రూపకల్పనకు డా.బి.జయరాములు సంపాదకులుగా, సుధామ ప ...

పుల్లెల శ్రీరామచంద్రుడు
                                     

ⓘ పుల్లెల శ్రీరామచంద్రుడు

పుల్లెల శ్రీరామచంద్రుడు, రచయిత, అనువాదకుడు, సంస్కృత పండితుడు. సంస్కృత కావ్యాలు, నాటకాలు, శాస్త్రాలు వంటివి తెలుగులోకి అనువదించి వ్యాఖ్యానించారు.

                                     

1. బాల్యం, విద్యాభ్యాసం

తూర్పుగోదావరి జిల్లా, ఐనవోలు మండలం ఇందుపల్లి గ్రామంలో 1927, అక్టోబరు 24 న నరకచతుర్దశి నాడు పుల్లెల సత్యనారాయణశాస్త్రి, సత్యవతి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఇందుపల్లికి సమీపంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో స్థిరపడ్డారు. తండ్రి వద్ద పంచకావ్యాలు, శ్రీహర్షుని నైషధం, మురారి అనర్ఘరాఘవం మొదలైన కావ్యాలను చదివారు. తండ్రివద్ద సిద్ధాంతకౌముది వ్యాకరణ గ్రంథాన్ని కూడా అధ్యయనం చేశారు. పిదప నరేంద్రపురం లోని సంస్కృతపాఠశాలలో చేరారు. అక్కడ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి శిష్యరికంలో కిరాతార్జునీయం వంటి ప్రౌఢకావ్యాలు, వ్యాకరణ గ్రంథాలు చదివారు. తరువాత మద్రాసు మైలాపూరులోని సంస్కృత కళాశాలలో వేదాంత శిరోమణి చదివారు. ఆ సమయంలోనే వి.వెంకటాచలం అనే సహవిద్యార్థి వద్ద ఆంగ్ల భాష నేర్చుకున్నారు. హిందీ ప్రచారసభ వారి విశారద పరీక్ష పూర్తి చేశారు. 1950లో మలికిపురం హైస్కూలులో హిందీపండిట్‌గా ఉద్యోగం చేస్తూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1952లో తెలుగు విద్వాన్, 1953లో ఇంటర్మీడియట్,1955లో బి.ఎ., 1957లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి అలంకారశాస్త్రం ప్రధానాంశంగా ఎం.ఎ. చదివారు. అదే యూనివర్సిటీ నుండి ఆంగ్లంలో ఎం.ఎ. 1961లో ఉత్తీర్ణులయ్యారు. 1963లో హిందీలో అక్కడి నుండే ఎం.ఎ. పూర్తి చేశారు. 1966లో ఆర్యేంద్రశర్మ పర్యవేక్షణలో కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ పండితరాజ జగన్నాథ టు సాంస్క్రీట్ పొయటిక్స్ అనే అంశంపై సిద్ధాంతవ్యాసం సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు.

                                     

2. ఉద్యోగ ప్రస్థానం

వీరు 1948లో మలికిపురంలో ఒక హైస్కూలులో హిందీపండిట్‌గా తమ ఉద్యోగ పర్వాన్ని ప్రారంభించారు. 1951లో అమలాపురం కె.బి.ఆర్. కాలేజిలో సంస్కృత పండిట్‌గా చేరారు. 1957నుండి సంస్కృత లెక్చెరర్‌గా పదవిని నిర్వహించారు. 1960 నుండి 1965వరకు వరంగల్లు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 1965లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌కాలేజీకి బదిలీ అయ్యారు. 1976లో సుమారు నాలుగు నెలలపాటు తిరుపతిలోని ఎస్.వి.ఓరియంటల్ రిసెర్చి ఇన్స్‌టిట్యూట్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. తరువాత తిరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రీడర్‌గా కొనసాగారు. తర్వాత కొంతకాలానికి ప్రొఫెసర్‌గా పదోన్నతిపొంది సంస్కృత విభాగానికి అధిపతిగా ఉన్నారు. సంస్కృత అకాడెమీకి డైరెక్టర్‌గా 11 సంవత్సరాలు సేవలను అందించారు. సురభారతి సమితికి కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశారు.

                                     

3. పురస్కారాలు

 • 1994లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే విశ్వభారతి పురస్కారం.
 • 2008లో బి.ఎన్.రెడ్డి సాహితీ పురస్కారం.
 • 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి "తెలుగు ఆత్మగౌరవ" పురస్కారం
 • 2006లో కాళిదాస జ్ఞానరత్న పురస్కారం.
 • శిష్యబృందంచే కనకాభిషేకం.
 • కాళిదాసు సంస్కృత విశ్వవిద్యాలయం, రాంటెక్ వారి రాష్ట్రీయ పురస్కారం.
 • 2002లో కేంధ్రసాహిత్య అకాడెమీ వారి ఉత్తమ సాహితీవిమర్శ పురస్కారం.
 • 1996లో కేంద్రసాహిత్య అకాడెమీ వారి ఉత్తమ అనువాద పురస్కారం.
 • గుప్త ఫౌండేషన్‌, ఏలూరు వారిచే 1997లో శ్రీ కృష్ణమూర్తి సాహిత్యపురస్కారం.
 • 2011లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ సాహిత్య రంగం.
 • 2012లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం.
 • 2007లో అజోవిభో కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవిత కళాసాధన పురస్కారం.
 • 2012లో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారం.
 • 2013లో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వారిచే గౌరవ డి.లిట్ పట్టా.
 • 1962.1964లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే నగదు పురస్కారాలు
 • తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం.
 • రాష్టపతి పురస్కారం.
 • 2000లో సనాతనధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి Eminent Citizen అవార్డు.
 • 2004లో బిర్లా ఫౌండేషన్ వారి వాచస్పతి పురస్కారం.
 • మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కారం.
 • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీవారిచే అలంకారశాస్త్రంలో ఉత్తమ పండితునిగా సత్కారం
 • తెలుగుభాషా పురస్కారం 2011లో సి.పి.బ్రౌన్‌ అకాడమీ వారిచే.
 • 2011లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →