Back

ⓘ యాజ్ఞవల్క్య మహర్షి                                               

భరద్వాజ మహర్షి

వేదాల ప్రకారం, భరద్వాజ బార్హస్పత్య అనేది ఈతని అసలు పేరు. ఆ పేరు లోని బార్హస్పత్య అనేది వీరి తండ్రి అయిన బృహస్పతిని స్పురణకి వచ్చేవిధంగా ఉంటుంది. శతపథ బ్రాహ్మణం ప్రకారమే కాకుండా, వేదాలలో కూడా ప్రస్తావించిన సప్త ఋషులలో ఈయన కూడా ఒక్కరు. సప్త ఋషుల గురించి మహాభారతంలోనూ, పురాణాలలోనూ కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణాల ప్రకారం ఈయన అత్రి మహర్షి కొడుకుగా చెప్పబడింది. చరక సంహిత ప్రకారం, ఈతడు వైద్య శాస్త్రాన్ని దేవతల రాజు అయిన ఇంద్రుని వద్ద అధ్యయనం చేసాడు. భరద్వాజ అనే పదాన్ని సంస్కృతంలో, "భారద్, వాజ్మ్" అనే రెండు పదాల కలయిక వల్ల ఉద్బవించింది. గోత్ర ప్రవర చెప్పేటప్పుడు త్రయా ఋషుల ప్రవరలలోని ఒకదాని ...

                                               

శతపథ బ్రాహ్మణం

శతపథ బ్రాహ్మణం వేద కర్మలను వివరిస్తూ, శుక్ల యజుర్వేదం సంబంధం ఉన్న గద్య గ్రంథాలలో ఇది ఒకటి. శుక్ల యజుర్వేదం నకు సంబంధించి ఉన్న ఒకే ఒక బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం ఇది 100 అధ్యాయాలు ఉన్న గ్రథం కాబట్టి దీనికి ఈ పేరు సార్థకమైంది. దీని మూలరూపం రెండు విభాగాలు ఉంది. మాధ్యందిన శాఖకు చెందిన మాధ్యందిన శతపథ బ్రాహ్మణం, కాణ్వ శాఖకుచెందిన కాణ్వ శతపథ బ్రాహ్మణం. ఈ రెంటి శాఖలలో చిన్న చిన్న తేడాలుంటాయి తప్ప పెద్దగా భేదము లేదు. సాయణుడు మాధ్యందిన శతపథ బ్రాహ్మణమునకు సమగ్రంగా భాష్యం చేయడము వలన ఇది వైదిక లోకానికి అందుబాటులోకి బాగా వచ్చింది.

                                               

విదేహా రాజ్యము

విదేహా రాజ్యము వేద భారతదేశంలో పురాతన రాజ్యం, ఇది జనక మహారాజు చేత స్థాపించబడింది. ఈ రాజ్యం యొక్క సరిహద్దు ప్రస్తుతం ఉత్తర బీహార్ లోని మిథిల ప్రాంతంలో, నేపాల్ యొక్క తూర్పు తెరేలో ఉంది. పవిత్రమైన రామాయణం ప్రకారం, విదేహా రాజ్యము యొక్క రాజధాని మిథిలా నగరి అని ప్రస్తావించబడింది. మిథిల అనే పదం, మొత్తం రాజ్యాన్ని కూడా సూచించడానికి ఉపయోగించబడింది. వేద కాలం నాటి క్రీ.పూ 1100-500 బిసిఈ సమయంలో, విదేహ రాజ్యం దక్షిణ ఆసియాలో ప్రధాన రాజకీయ, సాంస్కృతిక కేంద్రాలలో కురు, పాంచాలా రాజ్యాలతో పాటుగా ఒకటిగా ఉండేది. విదేహ రాజ్యానికి చెందిన రాజుల పేరు జానకాస్ లేదా జనకులు అని పిలువబడేవారు. బ్రాహ్మణాలు, బృహదారణ్యక ఉప ...

                                               

సత్యవతి (ఋచీకుడి భార్య)

ఒకనాడు పని మీద రాజు గారి దగ్గరకు వెళ్ళిన ఋచీక మహర్షి అక్కడ ఉన్న అందాలరాశి సత్యవతిని చూసి పరవశించి, బ్రహ్మచర్యం పాటిస్తూ తపోదీక్షలో ఇంతకాలము ఉన్ననూ, ఆమె సౌందర్యమునకు ముగ్ధుడై, మనసు సత్యవతి యందే లగ్నమొనర్చి, ఆమెనే వివాహమాడ నిశ్చయిచుకొని, తన మనసులోని ఆంతర్యాన్ని గాధికి విశదపరచి, సత్యవతిని తనకిచ్చి వివాహము జరిపించమని కోరతాడు.

                                               

వాయుదేవుడు

వాయుదేవుడు లేదా వాయు అని అంటారు.పురాణాల ప్రకారం వాయుదేవుడు అని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతానుసారం అతడు వాయవ్య దిక్కుకు అధిపతి.ఒక ప్రాధమిక హిందూ దేవత, గాలుల ప్రభువు, భీముడు తండ్రి, హనుమంతుడి ఆధ్యాత్మిక తండ్రిగా పరిగణిస్తారు.అలాగే ప్రకృతి ఉనికికి కారణమైన పృధ్వి, అగ్ని, నీరు, వాయువు, శూన్యం అనే మౌలికమైన పంచభూతాలకు చెందిన ఒకటిగా చెప్పుకోవచ్చు."వాయు"ను ఇంకా గాలి, పవన, ప్రాణ అని వర్ణించారు.ఋగ్వేదం ప్రకారం రుద్ర అని కూడా వర్ణించారు.

                                               

తైత్తిరీయ బ్రాహ్మణం

తైత్తిరీయ శాఖ అనునది కృష్ణ యజుర్వేదంలో ఒక ముఖ్యమైన శాఖ ఉంది. విష్ణు పురాణంలో తిత్తిరి అనే ఒక యాస్క విద్యార్థికి ఇది సంబంధించింది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రబలంగా ఉంది. తిత్తిరిమహర్షి రచించినది కావున తైత్తిరీయ బ్రాహ్మణము. పైంగియాస్కుడు శిష్యుడు తిత్తిరి. పైంగియాస్కుడు యొక్క గురువు వైశంపాయనుడు. తిత్తిరి శిష్యుడు ఉఖుడు. తిత్తిరి మహర్షి యొక్క ప్రశిష్య్దు ఆత్రేయుడు.

                                     

ⓘ యాజ్ఞవల్క్య మహర్షి

అది కురు పాంచాల దేశము. అందు గంగ ప్రవహించెడిది. ఆ నదీ తీరమున చమత్కార పురమను నగరము ఉంది. ఆ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. యజ్ఞవల్కుడను సార్థక నామధేయుడు. అతని భార్య సునంద. ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు. అతడే యాజ్ఞవల్క్యుడు. తన కుమారునకు అయిదవ ఏట అక్షరాభ్యాసమూ, ఎనిమిదవ ఏట ఉపనయనము చేశాడు. ప్రాతఃస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఇతను భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించాడు. వైశంపాయనుని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపములో గక్కి శాపాన్ని బాపుకున్నారు. అతను గక్కిన పదార్థాన్ని తిత్తిరిపక్షులు తిని, అవి తిరిగి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడు. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్క్యుని రెండవ భార్య అయినది.

యాజ్ఞవల్క్య స్తుతి

సంయమితిలక! నీ సరసవాక్యంబులు

పరికంప వేదాంత భాషణములు

పరమ బుషీంద్ర! నీ కరుణాకటాక్షంబు

లఖిలంబులకు జీవననౌషధములు

ధరణీ సురేంద్ర! నయురు తర క్రోధముల్‌

దావపాపక శిఖాధారణములు

సజ్జన శ్రేష్ఠ నీ సభ్య నైషికములు

సకల పురాణాను సమ్మతములు

దినము నీ వొసంగు దీవన్యనృపతుల

భూరిసంపదలకు గారణములు

నిన్ను సన్నుతింప నేనెట్లు నేర్తును

యాజ్ఞవల్క్య! మునికులాగ్రగణ్య!.

యాజ్ఞవల్క్యుడు బాష్కలుని వద్ద బుగ్వేదము, జైమిని వద్ద సామవేదము, అరుణి వద్ద ఆధర్వణ వేదము అభ్యసించాడు. కుమారుడు అనతికాలముననే మూడు వేదములు అభ్యసించి జ్ఞానియైనందుకు తండ్రి సంతోషించాడు. అతనంతరం తన కుమారుని వైశంపాయనుని వద్దకు పంపాడు. యాజ్ఞవల్క్యుడు వైశంపాయుని శిష్యుడై యజుర్వేదాధ్యయనం చేయసాగాడు. అతను వద్ద మరెన్నో విషయములు తెలుసుకొనసాగాడు. అహంకారము, విద్యామదము అంకురించాయి. ఆ సంగతి గురువు గ్రహించాడు. క్రమముగా నశించునని వైశంపాయనుడు ఊరుకున్నాడు. యాజ్ఞవల్క్యునకు విద్యామదము నశించడం లేదు సరికదా పెరుగుతోంది. ఒకనాడు వైశంపాయనుడు తన మేనల్లుడు అవినీతుడై సంచరించుచున్నాడని కోపముతో ఒక తన్ను తన్నాడు. బ్రాహ్మణుని కాలితో దన్నిన అది బ్రహ్మహత్యతో సమానము. ఈ పాపము నుండి దూరమగుట ఎట్లా యని శిష్యులందరకు చెప్పగా విద్యా గర్వితుడైన యాజ్ఞవల్క్యుడు గురువర్యా ఇది ఎవరివల్లా నశించదు. నేనొక్కడనే ఆపగలవాడను అని గర్వంగా పలికాడు. వైశంపాయనుడు శిష్యుని అహంకారమునకు మండిపడీ యాజ్ఞవల్క్యా నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపరచదలచావా నే నేర్పినది నా వద్ద క్రక్కి వెంటనే ఆశ్రమము విడిచిపో. గురుద్రోహి అని కఠినంగా పలికాడు. యాజ్ఞవల్క్యుడు గురువు పాదములపై బడి శోకించాడు. కరుణించమని వేడుకున్నాడు. తన తపోబలంతో బ్రహ్మహత్యాదోషము బాపి తాను నేర్చుకున్న వేదములను రుధిరరూపమున గ్రక్కి వెళ్ళిపోయాడు. ఈ గ్రక్కిన పదార్ధమును దిత్తిరి పక్షులుతిన్నవి. అవి తిరిగి ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. అనంతరం యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి అతను కరుణకు పాత్రుడై శుక్ల యజుర్వేదమును గ్రహించి గురువు కన్న అధికుడయ్యాడు. ఆ తరువాత సరస్వతిని ఉపాసించి సమస్త విద్యలు సంపాదించాడు. ఆ విధంగా అతడు అమానుష విద్యానిధియైనాడు.

ఇతను ప్రథమ శిష్యుడు కణ్వుడు. వీరే ప్రథమ శాఖీయులు, గాణ్వశాఖీయులు. జనకుడు యాగము చేయుచూ మహర్షులందరిని ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యునకు కూడా వర్తమానం పంపాడు. వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనం పై కూర్చుండబెట్టాడు. యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి. మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాసులు స్వీకరించవచ్చు అని గంభీరంగా పలికాడు. ఎవరూ సాహసించలేదు. ఎవరికి వారే సంశయంలో ఉండిపోయారు. అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాసులను గృహమునకు పట్టుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. విన్న విప్రకూటమి అతనితో వాదించి ఓడిపోయారు. శాకల్యుడను ముని కూడా వాదించి ఓటమి అంగీకరించాడు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు. యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించి చెప్పాడు. ఒకనాడు విశ్వావసుడను గందర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు అరుదెంచి తత్త్వముపదేశించమని అర్థింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత వివ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు.

ఈ కాలంలో కతుడను ఒక బుషి ఉండేవాడు అతనుకు కాత్యాయని యన కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహం చేయ నిశ్చయించి కతడు ఈ విషయమును యాజ్ఞవల్క్యునకు తెలియజేశాడు. యాజ్ఞవల్క్యుడు సమ్మతించగా అతి వైభవంగా వివాహం జరిగింది. మిత్రుడను బ్రాహ్మణుని కుమార్తె, గార్గి శిష్యురాలగు మైత్రేయి యాజ్ఞవల్క్యుని తప్ప అన్యులను వివాహమాడనని శపథం చేసింది. ఈ విషయం తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు. గార్గి ఆమెను కాత్యాయినికి అప్పగించింది. వారిద్దరు స్నేహంగా ఉంటున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఆ పరిస్ధితి రాగానే గార్గి అసలు విషయం కాత్యాయినికి తెలిపింది. కాత్యాయిని సంతోషించి మగని వల్ల వరం పొంది మైత్రేయికి వివాహం జరిపించింది. భార్యలిద్దరితో యాజ్ఞవల్క్యుడు హాయిగా కాలం వెలిబుచ్చుతున్నాడు.

ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది. బుషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్య మనీ ప్రసిద్ధికెక్కాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమునుపదేశించి సన్యసించాడు. అతను పేర ఒక స్మతి ప్రచారంలో ఉంది. అందనేక విషయము ఉన్నాయి. కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేశాడు. యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యుమను పేర ప్రచారంలో ఉన్నాయి. ఈ బుషి ప్రాతఃస్మరణీయుడు. అతను జయంతి రోజున అతను్ని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.

యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం బృహదారణ్యకోపనిషత్తు సహా, యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →