Back

ⓘ హర్యానా                                               

సిర్సా జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో సిర్సా జిల్లా ఒకటి. సిర్సా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. సిర్సా పట్టణం ఢిల్లీ నుండి 250 కి.మీ దూరంలో ఉంది. జాతీయ రహదారి 10 ఈ జిల్లా గుండా పోతుంది.

                                               

హర్యానా తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం. ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం, పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి. సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది. కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది. పెద ...

                                               

సిర్సా (హర్యానా)

సిర్సా హర్యానా రాష్ట్ర పశ్చిమ భాగంలో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పట్టణం. ఇది సిర్సా జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలన పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ఇది ఢిల్లీకి వాయవ్యంగా 260 కి.మీ. దూరం లోను, రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి 240 కి.మీ. దూరంలోనూ ఉంది. పట్టణ చరిత్ర మహాభారత కాలం నాటిది. సరస్వతి నది లుప్తమవక మునుపు ఈ ప్రాంతంలో ప్రవహించేది.

                                               

పిన్‌కోడ్

పిన్‌కోడ్ తపాలా సూచిక సంఖ్య. ఈ విధానం భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడింది.దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.

                                               

మహేంద్రగఢ్ జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో మహేంద్రగఢ్ జిల్లా ఒకటి. ఈ జిల్లా వైశాల్యం 1.859 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 8.12.022. జిల్లా కేంద్రంగా నార్నౌల్ పట్టణం ఉంది. జిల్లా పేరు జిల్లా కేంద్రం పేరు వేరువేరుగా ఉండే కొద్ది జిల్లాలలో మహేంద్రగఢ్ ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా జనసంఖ్య పరంగా హర్యానా రాష్ట్ర జిల్లాలలో 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో పంచ్‌కుల, రేవారీ జిల్లాలు ఉన్నాయి.

                                               

కర్నాల్ జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో కర్నాల్ జిల్లా ఒకటి. కర్నాల్ నగరం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా లోని ఇతర ప్రధాన నగరాలు అస్సంధ్, ఘరౌండా, నిలోఖెరి, ఇంద్రి, జుండ్ల. ఈ జిల్లా రోహ్‌తక్ డివిజనులో భాగంగా ఉంది.

హర్యానా
                                     

ⓘ హర్యానా

హర్యాణా వాయువ్య భారతదేశములోని రాష్ట్రము. దీనికి ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములు, పశ్చిమాన, దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున యమునా నది హర్యాణా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములకు సరిహద్దుగా ఉంది. ఘగ్గర్ నది, మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నాయి.

                                     

1. భౌగోళికము

హర్యాణా ఉత్తరాన 27 డిగ్రీల 37 నుండి 30 డిగ్రీల 35 అక్షాంశముల మధ్య, 74 డిగ్రీల 28 నుండి 77 డిగ్రీల 36 రేఖాంశముల మధ్య ఉంది. హర్యాణా రాష్ట్రము సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉంది. పరిపాలనా సౌలభ్యము కొరకు రాష్ట్రము నాలుగు విభాగములుగా విభజించబడింది. అవి అంబాలా, రోతక్, గుర్‌గావ్, హిస్సార్. రాష్ట్రము 19 జిల్లాలు, 47 ఉప-విభాగములు, 67 తాలూకాలు, 45 ఉప-తాలూకాలు, 116 బ్లాకులుగా విభజించబడింది. హర్యాణాలో మొత్తము 81 నగరములు, పట్టణములు, 6.759 గ్రామాలు ఉన్నాయి. 1.553 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో అడవులు ఉన్నాయి. హర్యాణా యొక్క నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు.

 • యమునా - ఘగ్గర్ సరస్వతి పల్లపు భూమి
 • అర్ధ-ఎడారి ఇసుకమయమైన పల్లపు భూమి
 • ఆరావళి శ్రేణులు
 • శివాలిక్ పర్వతశ్రేణులు
                                     

2. చరిత్ర

ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద నాగరికతలలో, సింధు లోయ నాగరికత ఉంది. రాఖిగిరి వంటి అనేక తవ్వకాల ప్రదేశాలు పురావస్తు పరిశోధనల యొక్క ముఖ్యమైన ప్రదేశాలు. అత్యంత అభివృద్ధి చెందిన మానవ నాగరికత సింధు నది వెంట వృద్ధి చెందింది, ఇది ఈ ప్రాంతంమధ్యలో ఒక సారి ప్రవహించింది.సింధు లోయలో సుగమం చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద ఎత్తున వర్షపునీటి సేకరణ వ్యవస్థ, టెర్రకోట ఇటుక, విగ్రహ ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన లోహపు పని కాంస్య, విలువైన లోహాలు రెండింటిలోనూ ఉన్నాయి. వాస్తవానికి సింధు నాగరికత ఆధునిక మానవ అభివృద్ధికి దారితీసింది.హర్యానాను సుల్తానేట్లు, మొఘలులు వంటి అనేక రాజవంశాలలో పాలించారు. ఇది ఆఫ్ఘన్లు, తిముత్ ఆక్రమణల క్రింద కూడా ఉంది.పంజాబ్ ప్రాంతములో అధికముగా హిందీ మాట్లాడే భాగము హర్యాణా అయినది. పంజాబీ మాట్లాడే భాగము పంజాబ్ రాష్ట్రము అయినది. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న ఛండీగఢ్కేంద్ర పాలిత ప్రాంతముగా యేర్పడి రెండు రాష్ట్రములకు రాజధానిగా వ్యవహరింపబడుతున్నది.

4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యాణా వైదిక, హిందూ నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితము ఇక్కడే శ్రీకృష్ణభగవానుడు మహాభారతయుద్ధ ప్రారంభ సమయమున గీతను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధము జరిగింది. మహాభారతములో క్రీ.పూ.900 హర్యాణా బహుధాన్యక సకల సంపదల భూమి అని వ్యవహరింపబడింది. హరియానా అన్న పదము మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు సంస్కృత శాసనములో కనిపిస్తున్నది. ఈ శాసనములో ఈ ప్రాంతము భూతల స్వర్గముగా అభివర్ణించబడింది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగినదని చాటుతున్నది.

నౌరంగాబాద్, భివానీలోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని రాఖీగర్హీ, రోతక్ లోని రూఖీ, సిర్సాలోని బనావలి మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి, హరప్ప పూర్వ సంస్కృతుల ఆధారములు లభించినవి. కురుక్షేత్ర, పెహోవా, తిల్‌పట్, పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారములు సమకూర్చినాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక పెహోవ, తిలప్రస్థ తిల్‌పట్, పానప్రస్థ పానిపట్, సోనప్రస్థ సోనిపట్ గా ఉల్లేఖించబడినవి.

                                     

3. రాష్ట్ర గణాంకాలు

 • అవతరణము.1 నవంబరు 1966

వైశాల్యము.44.212 చ.కి.

 • గ్రామాలు. 6.764 పట్టణాలు.106
 • పార్లమెంటు సభ్యుల సంఖ్య, 10 శాసన సభ్యుల సంఖ్య.90
 • జిల్లాల సంఖ్య.21
 • జనసంఖ్య. 25.353.081 స్త్రీలు. 11.847.951 పురుషులు. 13.505.130 నిష్పత్తి. 877
 • ప్రధాన భాష. హింది. పంజాబి. ప్రధాన మతం. హిందు, ఇస్లాం, క్రీస్తు
 • మూలము. మనోరమ యీయర్ బుక్
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →