Back

ⓘ ఉత్తరాఖండ్                                               

శ్రీనగర్ (ఉత్తరాఖండ్)

జమ్మూ కాశ్మీర్ యొక్క వేసవి రాజధాని మరొక శ్రీనగర్ తో గందరగోళం చెందకండి. శ్రీనగర్ భారతదేశంలోనీ, ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో పౌరి గర్హ్వాల్ జిల్లా లో మునిసిపల్ బోర్డు. ఇది గర్హ్వాల్ కొండలులో ఉన్న అతి పెద్ద పట్టణం. శ్రీనగర్ ఇక్కడ హిందీ,సంస్కృతము, గర్హవాలీ భాషలు మాట్లాడుతారు.పిన్ కోడ్: 246174,టెలిఫోన్ కోడ్: 01346-2.

                                               

భువన్ చంద్ర ఖండూరి

భువన్ చంద్ర ఖండూరి అక్టోబరు 1, 1934లో జన్మించాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.

                                               

2013 ఉత్తర భారతదేశం వరదలు

2013 లో ఉత్తరాఖండ్లో పలు రోజులపాటు కురిసిన విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది. 2004 లో భారతదేశం ఎదుర్కొన్న సునామీ తరువాత ఇదే అత్యంత ఘోరమైన విపత్తు. రాష్ట్రంలో మామూలుగా వచ్చే వరదల కన్నా ఎక్కువగా రావడానికి ఒక కారణం నదుల మీద నిర్మించే ఆనకట్టల తాలూకు వ్యర్ధాలు. ఈ వ్యర్థ పదార్థాలు నదుల సహజ ప్రవాహానికి అడ్డం పడి కట్టలు తెంచుకోవడానికి కారణం అయ్యాయి. 2013 జూన్ 16 ఈ వరదల్లో అతి ముఖ్యమైన రోజు. ఈ వరదలు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలనూ, నేపాల్ పశ్చిమ భాగాన్ని, టిబెట్ పశ్చిమ భాగాన్ని తాకినా కూడా 95% బాధితులు ఉత్తరాఖండ్కు చెం ...

                                               

కేదార్‌నాథ్

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్. "ప్రస్తుతం కేదార్‌నాథ్‌లో వరదల కారణంగా చాల మార్పులు సంభవించాయి. ఈ క్రింది సమాచారం వరదలకు ముందు సమకూర్చబడినది, గమనించగలరు."

                                               

రిషికేశ్

ఋషికేశ్ స్థితి కారకుడు విష్ణుమూర్తి నామాలలో ఒకటి.ఇది హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార కర్మలాచరించినట్లు పురాణ కథనం. రిషికేశ్ హరిద్వార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయ చార్‌దామ్‌లుగా పేరొందిన చెందిన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి. పవిత్ర గంగానదిఋషికేశ్ గుండా ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాలలోని శివాలిక్ కొండలను దాటి ఉత్తర భారత మైదానాలలో ప్రవేశించే ప్రదేశమే ఋషికేశ్. ఋషికేశ్ లోని గంగాతీరంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాగే నూతనంగా నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. ...

                                               

సుర్జీత్ సింగ్ బర్నాలా

సుర్జీత్ సింగ్ బర్నాలా పంజాబ్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవుల మాజీ గవర్నరు, మాజీ కేంద్రమంత్రి కూడా.

ఉత్తరాఖండ్
                                     

ⓘ ఉత్తరాఖండ్

BASWARAJ 1ST KING

మూస:BASWARAJ

ఉత్తరాఖండ్ హిందీ:उत्तराखण्ड ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చైనా టిబెట్, నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్లో ఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న గైర్సాయిన్ అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది.

ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని ఘఢ్వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమావూ అనీ అంటారు. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు భరల్, మంచుపులి వంటివి, వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన గంగా, యమునా నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఒక ముఖ్యమైన ఆర్థికవనరు. బ్రిటిష్ కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రాణీఖేత్‌లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా హరిద్వార్, ఋషీకేశ్, బదరీనాధ్, కేదారనాధ్ వంటి చాలా పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరుగొన్నాయి. పర్వాటక పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది.

ఇంకా వివాదాస్పదమైన తెహ్రీ ఆనకట్ట నిర్మాణం ఈ రాష్ట్రంలో భాగీరధీ-భిలంగనా నదిపై 1953లో ప్రారంభమైంది.

                                     

1. ప్రజలు

స్థానిక ప్రజలు తమను తాము "ఘర్వాలీలు", "కుమావొనీలు" అని చెప్పుకుంటారు. కుమావొనీలలో కొంతమంది "పహాడీ" అని చెప్పుకొంటారు. ఎక్కువమంది హిందూ మతస్థులు. ఇంకా గడచిన శతాబ్దంలో వలస వచ్చిన నేపాలీ సంతతి వారున్నారు. జధ్, మర్చా, సౌకా తెగలవారు భారత్-టిబెట్ సరిహద్దులలో నివసిస్తున్నారు. వీరందరినీ కలిపి "భోటియా"లంటారు. తెరాయి పర్వతప్రాంతాలలో "తారు", "భుక్షా" తెగలవారున్నారు. దక్షిణ తెరాయి ప్రాంతంలో "గుజ్జర్"లనే సంచార పశుపాలకజాతులవారు న్నారు.

                                     

2. భౌగోళికము

ఉత్తరాఖండ్ రాష్ట్రము అధికభాగం హిమాలయ పర్వతసానువులలో ఉంది. ఎత్తునుబట్టి వాతావరణమూ, భూస్వరూపమూ మారుతూ ఉంటాయి. ఎత్తయిన ప్రాంతాలలో మంచు కొండలూ, హిమానదాలూ ఉండగా, తక్కువ ఎత్తులున్నచోట ఉష్ణమండల వాతావరణమూ, దట్టమైన అడవులూ ఉన్నాయి. మరీ ఎత్తయిన స్థలాలు మంచుకొండలతోనూ, రాతినేలతోనూ ఉన్నాయి.

 • 2600-3000 మీటర్ల ఎత్తిన: కోనిఫెరస్ అటవీ ప్రాంతాలు
 • 3000 - 3500 మీటర్ల ఎత్తున: హిమాలయ గడ్డి మైదానాలు, ఇంకా ఎత్తైన చోట్ల టండ్రా మైదానాలు
 • 1500 మీటర్ల లోపు ఎత్తున: తెరాయి-దువార్ సవాన్నా మైదానాలు
 • 1500-2600 మీటర్ల ఎత్తున: వెడల్పు ఆకుల చెట్లున్న అడవులు
 • ఇంకా దిగువన: గంగానదీతీర మైదానాలు, డెసిడ్యువస్ అడవులు - వీటిని "భాభర్"లు అంటారు.

అక్కడి ప్రత్యేక భౌగోళిక లక్షణాల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చక్కని రాష్ట్రీయ ఉద్యానవనాలున్నాయి.

 • గోవింద పశువిహార్ జాతీయవనం ఉత్తరకాశి జిల్లా
 • గంగోత్రి జాతీయవనం ఉత్తరకాశి జిల్లా
 • నందాదేవి జాతీయవనం చమోలీ జిల్లా
 • జిమ్ కార్బెట్ జాతీయవనం నైనితాల్ జిల్లా
 • పూలలోయ వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు
 • రాజాజీ జాతీయవనం హరిద్వార్ జిల్లా
                                     

3. గణాంకాలు

 • మొత్తం విస్తీర్ణం: 51, 125 చదరపు కి.మీ.
పర్వత ప్రాంతం: 92.57% మైదాన ప్రాతం: 7.43% అడవి ప్రాతం: 63%
 • స్థానిక వివరాలు
రేఖాంశము తూర్పు 77° 34 27" నుండి 81° 02 22" అక్షాంశము: ఉత్తరం: 28° 53 24" నుండి 31° 27 50"
 • మోత్తం జనాభా: 7, 050, 634 పురుషులు, స్త్రీల నిష్పత్తి = 1000: 976
పురుషులు % 51.91 స్త్రీలు % 48.81 గ్రామీణ జనాభా: 76.90 % నగర జనాభా: 23.10 % మైనారిటీ వర్గాలు: సుమారు 2.0 %
 • విమానాశ్రయాలు: పంత్ నగర్, నైనిసాయిన్, జాలీగ్రాంట్
 • నగరాలు, పట్టణాలు: 81
 • గ్రామాలు: 15620
 • ముఖ్యమైన పర్వతాలు సముద్ర మట్టం నుండి ఎత్తు
 • అక్షరాస్యత 65%
 • రైల్వే స్టేషన్లు: కొత్వారా, డెహ్రాడూన్, హరిద్వార్, రిషీకేష్, హల్ద్వానీ, లాల్ కువాన్, కాథ్ గొడామ్K, తనక్ పూర్
గౌరీ పర్వత్ 6590, గంగోత్రి 6614, పంచ్ చూలి6910, నందాదేవి 7816, నందాకోట్ 6861, కామెట్7756, బద్రీనాధ్ 7140, త్రిశూల్ 7120, చౌఖంబా7138, దునాగిరి 7066
 • ముఖ్యమైన లోయలు పర్వత మార్గాలు
మనా 5450, నితీపాస్ 5070, లిపులేఖ్5122, లుంపియాధుర 5650
 • పరిశ్రమలు
పర్యాటక రంగము, పాడి పరిశ్రమ, వ్యవసాయం, పూలు పండ్ల తోటలు, చెఱకు, కొన్ని చిన్న పరిశ్రమలు
 • పండుగలు
ఉత్తరాణి, నందాదేవి మేళా, హోలి, దీపావళి, దసరా, కందాలీ, కొండజాతర, బిఖోటి, బగ్వాల్, హరేలా, ఘుగుటీ
 • ఉత్సవాలు
సర్దోత్సవ్, వసంతోత్సవ్, నందాదేవీ రాజ్ జాత్, చిప్లా కేదార్ జాత్, కేదారనాధ యాత్ర, బదరీనాధ యాత్ర, కుంభమేళా, అర్ధ కుంభమేళా, రామలీల
 • వాణిజ్య కేంద్రాలు
హల్ద్వానీ, రుద్రపూర్, తనక్ పూర్, డెహ్రాడూన్, హరిద్వార్, కొట ద్వార్, హృషీకేశ్
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →