Back

ⓘ సంస్కృతి                                               

తెలుగు సంస్కృతి

తెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు, నిర్మాణ శైలి, సాహిత్యం, ఆహారపుటలవాట్లు, ఆంధ్రుల దుస్తులు, మతం, తత్త్వాలుగా విభజించవచ్చు. ఇక్కడి వాగ్గేయకారులు, కూచిపూడి సుసంపన్నమైన సంస్కృతి-సంప్రదాయాలకి నిలువెత్తు సాక్ష్యాలు. కర్ణాటక సంగీతం లో, శాస్త్రీయ సంగీతంలో తెలుగు భాష ఇట్టే ఇమిడి పోవటంతో ఆంధ్ర ప్రదేశ్ సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి మాతృకగా వ్యవహరించింది. హైదరాబాదు ప్రాంతంలో పర్షియా నిర్మాణ శైలికి స్థానిక కళాత్మకత మేళవించి కట్టడాలని నిర్మించారు. వరంగల్లులో గ్రానైటు, సున్నపురాయి ల కలయికలతో కట్టడాలని నిర్మించారు. శాతవాహనులు ఆధ్యాత్మిక సూక్ష్మాలని తెలిపే శిల్పకళతో కూడిన కట్టడాలు అమరావతిలో నిర్మించార ...

                                               

హైదరాబాదు సంస్కృతి

అనేక వర్గాల ప్రజలు, జీవన విధానాలు, చారిత్రిక ప్రభావాల వలన హైదరాబాదు సంస్కృతి తక్కిన నగరాలకంటే కొంత విలక్షణతను సంతరించుకొంది. చారిత్రికంగా ఇది ముస్లిమ్ రాజుల పాలనలో ఉన్న హిందూ, ముస్లిం జనుల ప్రాంతం. కనుక తెలుగు, ఉర్దూ బాషల కలగలుపు గణనియంగా జరిగింది. అంతే కాకుండా ఇటీవల ఇతర ప్రాంతాలనుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన జనుల కారణంగా ఇది మరింత సంపన్నమైంది.

                                               

భారతీయ దుస్తులు

భారత సంస్కృతికి అద్దంపట్టే భారతీయ దుస్తులు ప్రపంచానికి ఆదర్శాలు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఉండే భారతీయ దుస్తుల పై విభిన్న సంస్కృతుల ఆయా ప్రదేశాల భౌగోళిక/వాతావరణ పరిస్థితుల, సంప్రదాయాల ప్రభావం గోచరిస్తుంది. ప్రాథమిక ఆచ్ఛాదననిచ్చే లంగోటీ ల నుండి రోజువారీ జీవితంలో ధరించే దుస్తులు, ప్రత్యేక సందర్భాలలో ధరించే దుస్తులు, నాట్యానికి రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులన్నింటిలోనూ ఈ ప్రభావాలు కనబడతాయి. పట్టణ ప్రాంతాలలో పాశ్చాత్య దుస్తుల వైపే ఎక్కువ మొగ్గు ఉన్ననూ, భారతీయత ఉట్టిపడే దుస్తులకు అక్కడ కూడా కొదవ లేదు. నేత, రంగులు మతానుసారం, సందర్భానుసారం ఉంటాయి. ఉదా: హిందువులు నలుపు రంగు దుస్తులు పూజ సమయంలో ...

                                               

భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ

భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది భారతీయ కళలు, సంస్కృతులను పరిరక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్నది. ఐక్యరాజ్య సమితి ఈ సంస్థకు 2007 సంవత్సరంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.

                                               

స్వర్ణపుష్పం

స్వర్ణపుష్పం 2012లో ప్రారంభించబడిన తెలుగు మాసపత్రిక. ఈ ప్రతిక సంస్థాపక ముఖ్య సంపాదకులు, ప్రచురణకర్త మక్కపాటి మంగళ. ఈ మాసపత్రిక యొక్క ఐఎస్ఎస్ఎన్ నెంబర్ ISSN 2394-2193.

                                               

లంబాడి

భారత దేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు, గిరిజనుల చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ఒక వైపు. ప్రదానంగా లంబాడీ తెగ గిరిజనుల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం. లంబాడీ పూర్వికులు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన సంస్కృతి, అడవులలో పశువుల పోషణ వీరి జీవన ఆధారం. తండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను కలిగి ఉన్నారు. లంబాడి తెగ పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు. లంబాడీలు సంతలో కానీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక ...

సంస్కృతి
                                     

ⓘ సంస్కృతి

సంస్కృతి అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

                                     

1. సంస్కృతి నిర్వచనం

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి. వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.

1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు, సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును.

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు సమూహపు సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే. ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్, క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమ సంకలనంలో "సంస్కృతి"కి 161 నిర్వచనాలను సేకరించారు

                                     

2. తెలుగువారి సంస్కృతి తెలుగుదనం

తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పండుగలు

వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి

                                     

3. బయటి లింకులు

  • Centre for Intercultural Learning
  • What is Culture? - Washington State University
  • Global Culture Essays on global issues and their impact on culture
  • Define Culture A compilation of over 100+ user submitted definitions of culture from around the globe.
  • Detailed article on defining culture
  • Dictionary of the History of Ideas "culture" and "civilization" in modern times
  • Reflections on the Politics of Culture by Michael Parenti
ఫిలిష్తీయుల సంస్కృతి యొక్క మ్యూజియం
                                               

ఫిలిష్తీయుల సంస్కృతి యొక్క మ్యూజియం

ఫిలిష్తీయుల సంస్కృతి యొక్క మ్యూజియం ఒక పురావస్తు సంగ్రహాలయం అష్డోదు, ఇజ్రాయెల్. ఇది నగరం యొక్క ప్రాంతంలో నివసించిన ఫిలిష్తీయులు సంస్కృతిని విశ్లేషించారు. మ్యూజియం ఫిలిష్తీయులు సంస్కృతికి అంకితం ప్రపంచంలో ఏకైక మ్యూజియం. ఇది 1990 లో అష్డోదు ప్రారంభమైన మొదటి ప్రదర్శనశాలను. మ్యూజియం 3 అంతస్తులున్నాయి. మొదటి ఫిలిష్తీయులు సంస్కృతిలో ఒక ప్రదర్శన ఉంది. రెండవ మారే ప్రదర్శనలు కోసం. మూడవ అంతస్తు ఏజియన్ సముద్ర యొక్క ఆహార సంస్కృతి అన్వేషించి ఫిలిష్తీయుల కిచెన్ "అంకితం.

బంగ్లా భాష
                                               

బంగ్లా భాష

బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి. బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు. బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →