Back

ⓘ ఉద్భటారాధ్య చరిత్ర                                               

నాదెండ్ల గోపన

నాదెండ్ల గోపన లేదా నాదెండ్ల గోపమంత్రి కొండవీడు దుర్గాధిపతి, సాళువ తిమ్మరసు చివరి మేనల్లుడు, శ్రీకృష్ణదేవరాయల సామంతుడు. ఈయన తండ్రి నాదెండ్ల తిమ్మయ్య, తల్లి తిమ్మరుసు చెల్లెలు కృష్ణమాంబ. నాదెండ్ల గోపమంత్రి ముత్తాత పేరు మల్లయ్య. ఈయనకు గంగన, చిట్టి గంగన్న అని ఇద్దరు సోదరులు. చిట్టి గంగన్న సాళువ నరసింహరాయల వద్ద మంత్రిగా ఉండేవాడు. చిట్టిన గంగన్న అందగాడు, అనర్గళమైన మాటకారి. ఈయనే తన శిష్యుడైన తిమ్మరుసును రాయల కొలువులో ప్రవేశపెట్టి నాదెండ్ల మల్లయ్య మనుమరాలు లక్ష్మమ్మతో తిమ్మరుసుకు వివాహము జరిపించాడు. తిమ్మరుసు చెల్లెలు కృష్ణమాంబకు నాదెండ్ల తిమ్మయ్యతో కుండమార్పిడి వివాహము జరిపించాడు. కృష్ణమాంబకు ముగ ...

                                               

కావ్య సమీక్షలు (పుస్తకం)

తిక్కన - నిర్వచనోత్తర రామాయణము - డా. ఎం.వి. సత్యనారాయణ జక్కన - విక్రమార్క చరిత్రము - శ్రీ కనుమలూరు వెంకటశివయ్య తెనాలి రామకృష్ణ కవి - పాండురంగ మహాత్మ్యము - డా. ఎక్కిరాల కృష్ణమాచార్య అనంతామాత్యుడు - భోజరాజీయము - డా. బి. అరుణ కుమారి కనుపర్తి అబ్బయామాత్యుడు - అనిరుద్ధ చరిత్రము - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి శ్రీకృష్ణదేవరాయలు - ఆముక్తమాల్యద - శ్రీ. కె.ఎ. కృష్ణమాచార్యులు పింగళి సూరన - కళాపూర్ణోదయము - శ్రీ రామవరపు శరత్ బాబు తెనాలి రామకృష్ణ కవి - ఉద్భటారాధ్య చరిత్ర - కుమారి నారపరాజు శ్రీవల్లి విజయరాఘవ నాయకుడు - రఘునాథ నాయకాభ్యుదయము - శ్రీ ముచ్చు సీతారామయ్య కూచిమంచి తిమ్మకవి - అచ్చతెలుగు రా ...

                                               

అష్టదిగ్గజములు

అష్ట దిగ్గజాలు అంటే "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు" అని అర్థం. హిందూ పురాణాలలో ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని ప్రతి. ఇవే అష్టదిగ్గజాలు. అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు.

                                               

తెనాలి రామకృష్ణుడు

తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నాన ...

                                               

శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరు ...

                                               

స్వారోచిష మనుసంభవము

మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము. తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు. ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన యిది. శృంగారానుభవ రుచి, శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును" మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషుని ...

                                     

ⓘ ఉద్భటారాధ్య చరిత్ర

ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు రచించిన తెలుగు కావ్యము. పాల్కురికి సోమనాధుడు రచించిన బసవ పురాణంలోని ఏడవ అశ్వాసంలో కల 38 పద్యాల ఉద్భుటారాద్య వృత్తాంతము ఆధారముగా రచించబడిన ఈ కావ్యము, మూడు అశ్వాసాలు, 842 పద్యాలు గల శైవ గ్రంథము. దీనిలో కథానాయకుడు ఉద్భటుడు. ఇందులో మదాలస చరిత్ర, ముదిగొండ వంశ మూల పురుషుని కథ ఉన్నాయి. రామలింగడు ఈ కావ్యాన్ని కొండవీటి దుర్గాధ్యక్షుడైన నాదెండ్ల గోపన వద్ద ముఖోద్యోగిగా ఉన్న ఊరదేచమంత్రికి అంకితమిచ్చాడు.

                                     

1. కథాసంగ్రహం

నైమిశారణ్యంలో శివపార్వతుల కేళీవిలాసానికి గంధర్వులు అంతరాయం కలిగించగా, శివుడు కోపించి, వాళ్లను పిశాచాలు కండని శపిస్తాడు. వాళ్లు శరణు వేడగా, శాంతించిన శివుడు కొంతకాలానికి తన మానసపుత్రుడైన ఉద్భటుడి వల్ల వారికి శాపవిమోచనం కలుగుతుందని అనుగ్రహిస్తాడు. శివుడి అంశతో పుట్టిన ఉద్భతుడు ముంజభోజుడనే రాజుకు దీక్షా గురువౌతాడు. ఇలా వుండగా, గంధర్వుల సంగతి గుర్తుకు వచ్చి, వాళ్ల శాపవిమోచనం కోసం ఉద్భటుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఉద్భటుడి కుమారులు అతని దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అతని దేహం నుండి వచ్చిన ధూమప్రసరణం చేత పిశాచాలకు శాపవిముక్తి కలిగి శివసాయుజ్యాన్ని పొందుతారు. ఇది ఈ కావ్యంలోని ప్రధాన కథ.

                                     

2. కొన్ని పద్యాలు

  • కవి ఈ క్రింది పద్యంలో శివ భక్తిరసంగా రచించి తద్వారా వేదాంత సారాన్ని బోధించాడు
  • కవి ఈ కావ్యంలో ఎన్నో వర్ణనలతో తన కావ్యాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఈ క్రిందీ పద్యంలో పార్వతీదేవి శివుడితో విహరించే వేళలో పంచశరు సామ్రాజ్యలక్షి లాగా ఉందట. ఈ పద్యంలోని మరో చమత్కారం ఉంది. ఇందులోని ప్రతి పాదంలోను శివుడికి ఉపమా నోపమేయాల్ని రెంటినీ చెప్పిన రామలింగడు పార్వతి విషయంలో ఉపమానాన్ని మాత్రమే ఉపయోగించాడు. ఇక్కడ కవి జగత్తున కాధారాధేయమైన శివ, శక్తి స్వరూపాన్ని ఆధ్యాత్మిక పరంగా మనోహరంగా వర్ణించాడు.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →