Back

ⓘ సౌర శక్తి                                               

సౌర కుటుంబం

సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయమే సౌర కుటుంబం. దీన్ని సౌర వ్యవస్థ అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి గ్రహాలు. మిగతావి మరుగుజ్జు గ్రహాల వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువులు సహజ ఉపగ్రహాలు. వీటిలో రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి. సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలు ...

                                               

సౌర లాంతరు పధకం

కిరసనాయిలు లాంతర్లు, వత్తితో వెలిగే దీపాల స్థానంలో సౌర శక్తితో వెలిగే లాంతర్లను వినియోగించడం ద్వారా వెలుతురు కొరకు అయ్యే కిరసనాయిలు వాడకాన్ని తగ్గించడం. శిలాజ ఇంధనాలు అవసరం లేని, కాలుష్యాలు విడుదల చేయని, ఆరోగయానికి హాని చేయని, అగ్ని ప్రమాదాల ముప్పు లేని, పర్యావరణానికి అనుకూలమైన కాంతి వ్యవస్థల వినియోగం ద్వారా గ్రామీణవాసుల జీవన స్థాయి మెరుగుపరచడం. చిన్న చిన్న కాంతి అవసరాలకు ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని చూపించడం

                                               

శక్తి

శక్తి అనేది ఇంగ్లీషు లోని ఎనర్జీ కి సమ ఉజ్జీ అయిన తెలుగు మాట. పందొమ్మిదవ శతాబ్దారంభానికి పూర్వం ఇంగ్లీషులో energy అన్న మాట లేనే లేదు. థామస్‌ యంగ్ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు ఈ మాటని ప్రవేశపెట్టేడు. గ్రీకు భాషలో energia అంటే పని. ఆ మాటని energy గా మార్చి దానికి ఒక నిర్ధిష్టమైన అర్ధాన్ని ఇచ్చేడు ఆయన. అంతకు పూర్వం vis viva అనే మాట వాడేవారు; అంటే living force లేదా జీవన బలం అని అర్ధం. ఈ ప్రపంచం world, univesre లో ఏ సంఘటన event జరిగినా లేక జరగాలన్నా దానికి కావలసిన శక్తి లభించాలి. ఈ ప్రవచనం statement భౌతిక ప్రపంచ మూల సూత్రాలలో fundamental principles ప్రథమ సూత్రంగా పరిగణించవచ్చు. విశ్వగతి అంతా శక్త ...

                                               

సౌర పురాణము

సౌర పురాణము హిందూ మత గ్రంథాల యొక్క శకంలోని శైవ ఉపపరాణాలలో ఒకటి. ఈ సౌర పురాణము వచనం యొక్క రూపంలో ముద్రిత సంచికలులో 69 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ముద్రిత సంచికల యొక్క అధ్యాయం చివరిమాటలో ఈ సౌర పురాణము బ్రహ్మ పురాణం లోని భాగంగా పేర్కొనబడింది. ప్రస్తుతం సంస్కరించబడిన వచనం యొక్క రూపంలో ఉన్నది అంతకుముందు సంస్కరణ ముందుగానే మరో విధంగా వచనం రూపంలో ఉనికిలో ఉందని భావించబడింది. సూర్యుడుకు ప్రత్యేకమైనది సౌర పురాణం అయిననూ, శివ, అతని శక్తి పార్వతిలను శ్లాఘిస్తుంది. ఈ మూలగ్రంథం వారణాసిని స్తుతిస్తుంది, దాని వివిధ పవిత్ర ప్రదేశాలు, లింగాలను వివరిస్తుంది. ఇందులో 31 వ అధ్యాయంలో ఊర్వశి, పురూరవుడు యొక్క కథనం యొక్ఒక ర ...

                                               

సౌర విద్యుత్తు

భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షం లోకి తిరిగివెళ్ళి పోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్తును హీట్ ఇంజన్ ఉష్ణోగ్రతా భేదాన్ని యంత్ర శక్తిగా మార్చేది ల నుంచి కానీ ఫోటో వోల్టాయిక్ ఘటాలనుంచి కానీ ఉత్పత్తి చేస్తారు.

                                               

సౌర వ్యాసార్థం

సౌర వ్యాసార్థం అనేది సూర్యుని యొక్క వ్యాసార్థానికి సమానంగా ఖగోళశాస్త్రంలో నక్షత్రాల యొక్క పరిమాణం వ్యక్తపరచేందుకు ఉపయోగించేటటు వంటి దూరం యొక్క యూనిట్. సౌర వ్యాసార్థం సాధారణంగా సౌర ఫోటోస్పియర్ లో పొరకు వ్యాసార్థముగా నిర్వచిస్తారు ఇక్కడ ఆప్టికల్ లోతు 2/3 సమానం.: 1 R ⊙ = 6.957 × 10 5 km {\displaystyle 1\,R_{\odot }=6.957\times 10^{5}{\hbox{ km}}} సౌర వ్యాసార్థం 696.342 ± 65 కిలోమీటర్లు 432.687 ± 40 మైళ్ళు వ్యాసార్థం ఉంది. హాబెరిటర్, ష్ముట్జ్ & కోసోవిచెవ్ 2008 సౌర ఫోటోస్పియర్ కు సంబంధించిన వ్యాసార్థాన్ని 695.660 ± 140 కిలోమీటర్లు 432.263 ± 87 మైళ్ళు గా నిర్ణయించారు.మానవరహిత SOHO అంతరిక్ష నౌక 2 ...

సౌర శక్తి
                                     

ⓘ సౌర శక్తి

సౌర శక్తి సూర్యుడి కిరణాల నుండి వెలువడే శక్తి. పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని మనకు తెలుసు. ప్రపంచంలో ఉండే బొగ్గు, నూనె, సహజవాయువు నిల్వలను సంగ్రహించి, సూర్యుడు రోజూ మనకు శక్తిని అందించే పరిమాణంలో వాడటం ప్రారంభిస్తే మూడు రోజులకు సరిపోతుందని శాస్త్ర జ్ఞులు అంచనా వేశారు. కానీ అపారమైన ఈ సౌరశక్తి నిధిని వాడటం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.

సౌర విజ్ఞానశాస్త్రం విస్తారంగా సౌర లేదా చురుకు సౌరగా విడదీసారు. ఇవి సౌర శక్తి మార్పిడి, పంపిణీ, కాప్చర్ మీద ఆధారపడి ఉంటాయి. చురుకు సౌర శక్తి పద్ధతులు కాంతివిపీడన ఫలకాలను, సౌర ఉష్ణ కలెక్టర్లు వాడకాన్ని కలిగి ఉంటాయి. నిష్క్రియాత్మక సౌర పద్ధతులు, ఒకటి సూర్యుని వైపు భవనం కట్టడం. మరొకటి అనుకూలమైన ఉష్ణ సాంద్రత లేదా కాంతి వెలువడే లక్షణాలు ఉన్న పదార్థాలు ఎంచుకోవడం, సహజంగా గాలి ప్రచారం కలిగించే ఖాళీల రూపొన్దించడం జరిగేధి.

2011 లో, అంతర్జాతీయ శక్తి సంస్థ, "ఎన్నటికి తరగని శక్తిని వాడటం వల్ల క్లీన్ సౌర శక్తి అభివృద్ధి, దీర్ఘకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది "అని అన్నారు. స్వతంత్ర వనరుల మీద నమ్మకం ద్వారా దేశాల శక్తి భద్రత పెంచడానికి, స్థిరత్వం పెంచడానికి, కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఉపశమన వాతావరణ మార్పు వ్యయాలను తగ్గించటానికి, ఇతరత్రా కంటే శిలాజ ఇంధన ధరలు తక్కువ చేస్తుంది. వీటి ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

సౌర వేడి నీటి వ్యవస్థలు వేడి నీటిని చేయుటకు సూర్యకాంతిని ఉపయోగిస్తారు. నీటి వినియోగం 60 నుంచి 70% భౌగోళిక అక్షాంశాల సౌర ఉష్ణ విధానాల ద్వారా అందించబడుతుంది. ఈత కొలనులలో వేడి చెయ్యటానికి unglazed ప్లాస్టిక్ కలెక్టర్లు 21% ; సౌర నీటి హీటర్లు అతి సాధారణ రకాల ట్యూబ్ కలెక్టర్లు 44%, మెరుపు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు 34% సాధారణంగా దేశీయ నీటి వేడి కోసం ఉపయోగిస్తారు. 2007 నాటికి, సౌర వేడి నీటి వ్యవస్థలు మొత్తం సామర్థ్యం సుమారు 154 ఘ్W గా ఉంది.

వీటి వినియోగంలో చైనా అందరి కంటే ఆధిక్యంలో ఉంది. ఇది 2020 నాటికి మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయిల్, సైప్రస్ లో వీటిని ఉపయోగించే గృహాలు 90% పైగా ఉన్నాయి.

                                     

1. జలతాపకం

సౌర శక్తి నుండి లబ్ధి పొందటానికి వాడే సాధనాల్లోనీటిని వేడిచెయ్యడం జలతాపకం మొట్టమొదటిది. వీటిని నల్ల రంగు పూసిన కాంక్రీట్ లో బిగించి ఉంటారు. నూర్య కిరణాల ఉష్ణాన్ని నలుపు రంగు గ్రహించటమే దీనికి కారణం. ఈ పెట్టెను గాజు పలకతో కప్పి ఉంచుతారు. గొట్టాల్లో ప్రవహించే నీళ్ళు సూర్యతాపం వల్ల బాగా వేడెక్కుతాయి. దీనిని పంప్ చేసి తొట్టిలో నిలవ చేసుకోవచ్చు. ఈ ఏర్పాటును ఇంటి పైకప్పు మీద అమర్చుతారు. ఒక్క ప్లోరిడాలోనే దాదాపు 50.000 ఇళ్ళలో ఇలాంటి వేడి నీటి యేర్పాట్లున్నాయి. ఇజ్రాయిల్ లో అయితే వీటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు.

                                     

2. హీట్ పంప్

క్లిష్టంగా ఉన్నప్పటికీ జలతాపకం కంటే సమర్థవంతమైన హీట్ పంప్ అనే మరోసాధనం ఉంది. రెఫ్రిజిరేటర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. వాతావరణం, నేల లేదా నదీ జలాల నుంచి ఈ సాధనం ఉష్ణాన్ని గ్రహిస్తుంది. మరిగే ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ద్రవం ఈ ఉష్ణం వల్ల వాయువుగా మారుతుంది. పంప్ సహాయంతో దీనిని సంపీడనము చేసి ద్రవీకారి లోకి పంపిస్తారు. అక్కడ ఇది మళ్లీ ద్రవంగా మారి, ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. హీట్ పంప్ లను వ్యతిరేక దిశలో పనిచేయనిస్తే ఎండాకాలంలో వీటి నుంచి చల్లని గాలిని పొందవచ్చు.

                                     

3. సోలార్‌ ఉత్పత్తులు

సోలార్‌ వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో చాలామంది ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల మొగ్గు చూపట్లేదు. వివిధ రకాల సోలార్‌ ఉత్పత్తులు వచ్చాయి. స్ట్రీట్‌లైట్స్‌, హోం లైటింగ్‌ సిస్టమ్స్‌, వాటర్‌ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంపులు లభిస్తున్నాయి. సోలార్‌ టోపీ ముందుభాగంలో చిన్నపాటి ఫ్యాన్‌ అమర్చి ఉంటుంది. ఎండ వేడికి ఈ ఫ్యాను తిరుగుతూ చల్లటి గాలిని అందిస్తుంది. అపార్ట్‌మెంట్లపై సోలార్‌ ఎనర్జీ ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీ ఇస్తోంది. ఇందుకు సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెడ్‌క్యాప్‌ కు దరఖాస్తు చేసుకోవాలి. దీని ఆధ్వర్యంలోని ఏజెన్సీల వారు అపార్ట్‌మెంటును పరిశీలించి, ఎన్ని వాట్స్‌ విద్యుత్తు అవసరమన్నది అంచనా వేస్తారు. వారే ప్లాంటును ఏర్పాటు చేస్తారు. ఒక కిలోవాట్‌ సోలార్‌ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది.సోలార్‌ ఎమర్జెన్సీ లైటుని ఎండలో 6 గంటలు ఉంచితే మూడు గంటల పాటు నిరంతరాయంగా బల్బు వెలుగుతుంది. రాత్రి వేళ అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోతే వీటిని ల్యాంప్‌లుగా ఉపయోగించుకోవచ్చు. సోలార్‌ హోం లైటింగ్‌ సిస్టంలో నాలుగు బల్బులుంటాయి. వీటికి ఉండే సోలార్‌ ప్యానెల్‌ని డాబామీద నీడలేని ప్రాంతంలో ఉంచాలి. ఇది వేడికి ఛార్జి అవుతుంది. ఇంట్లో నాలుగు గదులుంటే వాటిలో ఒక్కొక్క దానిలో ఒక్కో బల్బును వెలిగించుకోవచ్చు. ఇంటి ఆవరణలో సోలార్‌ వీధి దీపాలను ఒక పోల్‌కి అమర్చి దానిపై సోలార్‌ ప్యానెల్‌ ఉంటుంది. ఎండకు ఛార్జింగ్‌ అవుతుంది. రాత్రి పూట వెలుగులు విరజిమ్ముతుంది. సోలార్‌ వాటర్‌ హీటర్‌ని శాశ్వతంగా ఇంటి డాబాల మీద ఏర్పాటు చేసుకోవాలి. పగలు ఎండకు నీళ్లు వేడెక్కుతాయి. అలా వేడెక్కిన నీరు 24 గంటల పాటు 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో వెచ్చగా ఉంటాయి. మనం ఎప్పుడైనా వీటిని ఉపయోగించుకోవచ్చు. నీరు నిలువ ఉండే ట్యాంకు పైపులైనుకు పఫ్‌ ఏర్పాటు ఉంటుంది. అది నీరు చల్లబడకుండా కాపాడుతుంది. వీటిని ఆపార్ట్‌మెంట్లకు అమర్చుకొంటే విద్యుత్తు వినియోగాన్ని భారీగా ఆదా చేయవచ్చు. సోలార్ పవర్‌ ఇన్వర్టర్ల ద్వారా ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు, టీవీ పనిచేస్తాయి. మూడు, నాలుగు గంటల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సోలార్‌ ప్యానెళ్లు ఎండకు ఛార్జి అయి, విద్యుత్‌ సరఫరా లేని సమయంలో పనిచేస్తాయి.                                     

4. సోలార్ బైక్

పుణేకు చెందిన ఆయూబ్‌ఖాన్ పఠాన్, ఇమ్రాన్‌ఖాన్ పఠాన్ అనే ఇద్దరు బాబాయ్, అబ్బాయ్‌లు ‘సోలార్ హైబ్రిడ్ ఎకోఫ్రెండ్లీ బైక్’ రూపొందించారు. ఇంధనం అవసరం లేదు.కాలుష్యం ఉండదు. శబ్దమూ రాదు.ఇంటిదగ్గరే ఉన్నప్పుడు దీని విద్యుత్ ను సెల్‌ఫోన్లు, బల్బులు, ఫ్యాన్లు, కంప్యూటర్‌లు, టీవీలకూ ఉపయోగించుకోవచ్చు. మోటారు బైకుకు అమర్చే సోలార్ పీవీ ప్యానెళ్ల సహాయంతో డీ సీ బ్యాటరీ సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను గ్రహిస్తుంది. దానితో మోటారు బైకు వెనక చక్రానికి అమర్చిన డీసీ మోటారు పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ అయితే 50-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎండ బాగా ఉండి, చార్జ్ అవుతున్న బ్యాటరీని మోటార్‌కు అనుసంధానిస్తే ఏకథాటిగా 200-250 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. బ్యాటరీలో విద్యుత్ ఎనిమిది గంటల పాటు నిల్వ ఉంటుంది. బ్యాటరీకి మల్టీపర్పస్ సాచెట్ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో, సూర్యరశ్మి లేనప్పుడు ఇంట్లోని విద్యుత్‌తో చార్జ్‌చేసుకోవచ్చు.ఈ బైకు ధర రూ. 27 వేలు. సాక్షి25.5.2011

                                     

5. సౌర విద్యుత్తు

సౌర విద్యుత్తు అనగా సూర్యరశ్మి నుంచి తయారయ్యే విద్యుచ్ఛక్తి.

సంవత్సరం సౌర fluxes, మానవ శక్తి వినియోగం

SOLAR 3.850.000 J

WIND 2.250 J

BIOMASS POTENTIAL 100 - 300 J

PRIMARY ENERGY USE 510 J

ELECTRICITY 62.5 J

                                     

5.1. సౌర విద్యుత్తు సంవత్సరం సౌర fluxes, మానవ శక్తి వినియోగం

SOLAR 3.850.000 J

WIND 2.250 J

BIOMASS POTENTIAL 100 - 300 J

PRIMARY ENERGY USE 510 J

ELECTRICITY 62.5 J

                                     

5.2. సౌర విద్యుత్తు సోలార్ వాహనాలు:

సూర్యరశ్మితో నడిచే కారు తయారు చేయాలని 1980ల నుంచీ ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో ఆస్ట్రేలియాలో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహించబడుతుంది. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటారు. ఈ పందెం డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు సాగుతుంది.

                                     

5.3. సౌర విద్యుత్తు సౌర శక్తి నిల్వ పద్ధతులు:

ఆధునిక శక్తి వ్యవస్థలు సాధారణంగా శక్తి యొక్క నిరంతర లభ్యత ఊహించుకోవటం వలన సౌర శక్తి రాత్రి అందుబాటులో లేదు అందువలన శక్తి నిల్వవుంచడం ముఖ్యమైన విషయం. ఉష్ణ సాంద్రత వ్యవస్థలు రోజువారీ సీజనల్ వ్యవధులు కోసం ఉపయోగకరమైన ఉష్ణోగ్రతల వద్ద వేడి రూపంలో సౌర శక్తి నిల్వ చేయవచ్చు. థర్మల్ నిల్వ వ్యవస్థలు సాధారణంగా నీరు, భూమి, రాతి వంటి అధిక నిర్దిష్ట ఉష్ణ సామర్ధ్యం తయారుగా ఉన్న సామగ్రి ఉపయోగిస్తారు.

మైనము, గ్లాబెర్ యొక్క ఉప్పు వంటి ఫేస్ మార్పు పదార్థాలు ఉష్ణ నిల్వ లకు మరో మాధ్యమం. ఈ పదార్ధాలు అందుబాటులో, చవకగా దొరుకుతాయి. ఇవి దేశీయంగా ఉపయోగకరమైన ఉష్ణోగ్రతలను సుమారు 64 °C అందిస్తాయి. మొదటి సారిగా "డోవర్ హౌస్" డోవర్, మసాచుసెట్స్ లో 1948 లో, ఒక గ్లాబెర్ యొక్క ఉప్పు హీటింగ్ వ్యవస్థను ఉపయోగించింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →